ప్రీ క్లైమాక్స్ లో హరిహర వీరమల్లు

pawan kalyan hari hara veera mallu movie in pre climax

క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఈసినిమా కోసం పవన్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తిచేసుకుంది. పవన్ ఒక వైపు రాజకీయాలు, మరోవైపు ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూట్ ఆలస్యమవుతూ వస్తుంది. ఇక ఇప్పుడు ఈసినిమా షూటింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి వినిపిస్తుంది. ప్రస్తుతం మేకర్స్ ఈసినిమా ప్రీ క్లైమాక్స్ షూట్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. క్లైమాక్స్ కు రిలేట్ గా ఉంటే ఈ ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కు రెడీ అవుతున్నారట. ఈ ఎపిసోడ్ తో సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టే అని తెలుస్తుంది.

కాగా ఈసినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. అర్జున్‌ రాంపాల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో బాబి డియోల్ కూడా నటిస్తున్నాడు. ఔరంగజేబు పాత్రలో ఆయన నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా నోరా ఫతేహి యువరాణిగా, ఔరంగజేబు చెల్లెలు రోషనారా బేగమ్ పాత్రలో కనిపించనుంది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 14 =