పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) మొదటి షెడ్యూల్ ఈరోజుతో ముగిసింది. గత నెలలో ఈసినిమా షూటింగ్ ముంబై లో ప్రారంభం కాగా ఈరోజు తో తొలి షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని మేకర్స్ ప్రకటించారు.ఈసందర్భంగా పవన్ స్టిల్ ను రిలీజ్ చేశారు.ఈస్టిల్ లో పవన్ లుక్ అదిరిపోయింది. ఈ స్టిల్ కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ఇక మొదటి షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను తెరక్కించారు.తదుపరి షెడ్యూల్ మహాబలేశ్వర్ లో జరుగనుంది.ఈషెడ్యూల్ లో పవన్ అలాగే హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక మోహన్ లపై పాటను చిత్రీకరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Done with a blasting & very productive schedule in Bombay.
We promise, you’ll see the rage of @pawankalyan again!! 🤙🏻🔥🔥🔥🔥#TheyCallHimOG #OG pic.twitter.com/OpbuoV3Yer
— DVV Entertainment (@DVVMovies) May 2, 2023
మరోవైపు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తూ మేకర్స్ ఓజి పై భారీ అంచనాలను క్రీయేట్ చేస్తున్నారు.అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా వస్తున్న ఈసినిమాకి సుజీత్ డైరెక్టర్ కాగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఇక పవన్ ప్రస్తుతం ఈసినిమాతో పాటు మరో రెండు సినిమాలతో బిజీ గా వున్నాడు.అందులో ఒకటి హరిహర వీరమల్లు కాగా మరొకటి ఉస్తాద్ భగత్ సింగ్.క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు ఇప్పటివరకు 60శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది.త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది అయితే ఈమూడు సినిమాలకంటే ముందు పవన్,వినోదయ సీతం రీమేక్ తో థియేటర్లలోకి రానున్నాడు.ఇప్పటికే పవన్ ఈసినిమా షూటింగ్ పూర్తి చేయగా జులై 28న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: