పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలపైన ఫోకస్ పెట్టారు. ఇప్పుడు వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఒక సినిమా తరువాత మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటూ సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పటికే సముద్రఖని సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. రీసెంట్ గానే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఒక వారం రోజులు ఆసినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక ఇప్పుడు సుజీత్ సినిమాకు రెడీ అయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుజీత్ దర్శకత్వంలో పవన్ హీరోగా వస్తున్న సినిమా ఓజీ. పుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సుజీత్ ఈసినిమాను తెరకెక్కించనున్నాడు. మూడు రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇక నేడు పవన్ కళ్యాణ్ కూాడా ఈసినిమా సెట్ లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. ఈనేపథ్యంలో మేక్ వే ఫర్ ది ఓజీ అంటూ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు.
Make Way for The #OG…🔥🔥🔥 #PawanKalyan #FireStormIsComing #TheyCallHimOG pic.twitter.com/7Eiwp6QrDz
— DVV Entertainment (@DVVMovies) April 18, 2023
కాగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: