పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న గ్యాంగ్ స్టార్ మూవీ ఓజీ మరో 2 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచేశాయి.ఇక నిన్న ట్రైలర్ కూడా విడుదల కాగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఫుల్ యాక్షన్ కట్ తో వచ్చిన ఈ ట్రైలర్ అంచనాలను అందుకొని హైప్ ను డబుల్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా సెన్సార్ కూడా పూర్తయింది.ఈసినిమాకు ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. వైలెన్స్ ఎక్కువగా ఉండడం తో ఈ సర్టిఫికెట్ ఇచ్చారు.సెన్సార్ సభ్యులు కొన్ని కట్స్ కూడా చెప్పారు.రన్ టైం కూడా రివీల్ అయింది.154 నిమిషాల నిడివితో ఓజీ థియేటర్లలోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ ,టికెట్ హైక్ తో విడుదలకానుంది. దాంతో మొదటి రోజు ఓజీ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకోనుంది.ఇప్పటికే ఓవర్సీస్ లో ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో 2 మిలియన్ డాలర్ల వసూళ్లను సొంతం చేసుకుంది.
ఇందులో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక ఆరుళ్ మోహన్ నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.ప్రకాష్ రాజ్,అర్జున్ దాస్ ,శ్రీయా రెడ్డి కీలక పాత్రలు పోషించారు.డివివి దానయ్య ఈసినిమాను నిర్మించగా థమన్ సంగీతం అందించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























