హరి హర వీర మల్లు.. ఎపిక్ వార్ సీక్వెన్స్‌తో షూటింగ్‌ షురూ

Hari Hara Veera Mallu Team Begins Shooting with An Epic War Sequence,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Hari Hara Veera Mallu Team Begins Shoot With Epic War Sequence,Hari Hara Veera Mallu Team Begins Shoot,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Upcoming Movie,Pawan Kalyan Hari Hara Veera Mallu,Pawan Kalyan Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Telugu Movie,Hari Hara Veera Mallu Movie Update,Hari Hara Veera Mallu Movie Latest Update,Hari Hara Veera Mallu Movie Shooting Update,Hari Hara Veera Mallu Movie Latest Shooting Update,Hari Hara Veera Mallu Movie Shooting Begins,Hari Hara Veera Mallu Shooting Update

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రజాసేవకు తన సమయాన్ని కేటాయిస్తున్నారు. అదే సమయంలో తాను అంగీకరించిన సినిమాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన కథానాయకుడిగా ‘ఓజీ’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హర వీర మల్లు’ చిత్రాలు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా హరి హర వీర మల్లు చిత్రం నుంచి సాలిడ్ అప్డేట్ అందింది. దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను తీసుకున్న తరువాత, ఇటీవల విడుదలైన టీజర్ అభిమానులతో పాటు, సినీ ప్రేమికులలో ఈ చిత్రంపై భారీ అంచనాలను ఏర్పడేలా చేసింది. అనుకోని కారణాలతో గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న చిత్ర బృందం ఇప్పుడు వరుస అప్డేట్లను ప్రేక్షకుల కోసం విడుదల చేస్తూ వస్తోంది. దీనిలో భాగంగా ఒక కీలకమైన అప్డేట్ ని తాజాగా విడుదల చేసింది.

ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టు 14న తిరిగి ప్రారంభించినట్టు తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. ప్రముఖ యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో ఒక భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణ ప్రారంభించినట్టు ప్రకటించింది. ఈ భారీ యుద్ధ సన్నివేశ చిత్రీకరణలో సుమారు 400-500 మంది ఫైటర్లు మరియు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. కాగా పవన్ కళ్యాణ్ కూడా మరికొద్ది రోజుల్లో ‘హరి హర వీర మల్లు’ చిత్రీకరణలో పాల్గొంటారని చిత్ర బృందం వెల్లడించింది.

మునుపెన్నడూ చూడని విధంగా పవన్ కళ్యాణ్ ని ఒక అద్భుతమైన యోధుడిగా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేలా ఈ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించేందుకు గాను నిర్మాణ సంస్థ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసింది. పవన్ కళ్యాణ్ తన నట జీవితంలో మొదటిసారిగా చారిత్రాత్మక యోధుడుగా కనిపించనున్నారు.

ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ సంచలన నటుడు బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ సహా అనేక మంది ప్రముఖ నటీనటులు కూడా భాగమయ్యారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి ఈ చిత్రం కోసం అద్భుతమైన సెట్ లను రూపొందిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

లెజెండరీ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ త్వరలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.