కీలక సన్నివేశాల చిత్రీకరణలో పవన్ OG

pawan kalyan og movie shooting update

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఈసినిమా ఓజీ అనే టైటిల్ తో రూపొందుతుంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. ముంబైలో వేసిన ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ ను జరుపుకుంటుంది. పవన్ కూడా ఇప్పటికే షూటింగ్ లో పాల్గొన్నారు కూడా. ఇక ఈసినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా నటిస్తున్నాడు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. ముంబైలో ఈసినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నామని.. ప్రకాష్ రాజ్ నేటి నుండి షూట్ లో జాయిన్ అవుతున్నారని తెలిపుతూ ట్విట్టర్ ద్వారా పోస్ చేస్తూ తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. ఈసినిమాలో నటించే నటీనటులు, ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 1 =