పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సుజిత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమా ఓజీ అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా పవన్ కళ్యాణ్ ఇందులో గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ ను మాత్రం చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్. గత నెలలో ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టగా ముంబైలో కొంత వరకూ.. ఆ తరవాత పూణేలో కొద్ది రోజులు షూటింగ్ ను పూర్తి చేశారు. దీంతో ఒక కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ డేట్ పై ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈసినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈసినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే క్రిస్మస్ బరిలో పలు సినిమాలు ఉన్నాయి. మరి పవన్ ఓజీ సినిమాపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: