అఫీషియల్- పవన్ OG లో ఖైదీ ఫేమ్ అర్జున్ దాస్

tamil talented actor arjun das on board in pawan OG movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలతో కూడా బిజీగా ఉంటూ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా కూడా ఒకటి. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా ప్రస్తుతానికి ఓజీ అనే టైటిల్ తోనే షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమాలో ఖేదీ ఫేమ్ అర్జున్ దాస్ నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో అర్జున్ దాస్ కూడా భాగమైనట్టు చిత్రనిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇందులో అర్జున్‌ దాస్‌ విలన్‌ గా నటించబోతున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 17 =