
ట్యాగ్ · 38 కథనాలు · పేజీ 2


"హరిహర వీరమల్లు" లేటెస్ట్ అప్ డేట్

పవన్ కళ్యాణ్ న్యూ మూవీ అప్ డేట్

అందరికీ కృతజ్ఞతలు - పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ కు మెగా పవర్ స్టార్ బర్త్ డే విషెస్

'PSPK 28' జాతర షురూ

'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ కు 'మెగా' బర్త్ డే విషెస్

పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ అప్ డేట్స్

పవన్ కళ్యాణ్ అన్న లెక్క -రామ్ చరణ్

"హరిహర వీరమల్లు "కు మరో భారీ సెట్

పవన్ కళ్యాణ్ పై స్టార్ రైటర్ ప్రశంసలు

'వకీల్ సాబ్'- 9 పేజీల డైలాగ్..సింగిల్ టేక్
పవర్ స్టార్ 'ఫస్ట్ వాల్ పోస్టర్'

'హరి హర వీరమల్లు' ప్రేక్షకులకు షాకిచ్చేలా ఉంటుంది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉండగా మరికొద్దిరోజుల్లోనే షూటింగ్ పూర్తికానుంది. ఈ సినిమా తరువాత క్రిష్ సినిమా మొదలుపెట్టనున్నాడు పవన్.

"హరిహర వీరమల్లు" లేటెస్ట్ అప్ డేట్
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ "హరిహర వీరమల్లు " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ సెట్స్ తో తెరకెక్కుతున్న "హరిహర వీరమల్లు " మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ తెలుగు , తమిళ ,మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

పవన్-హరీష్ మూవీ నుండి పవర్ ప్యాక్డ్ అనౌన్స్ మెంట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే సాగర్ చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా తరువాత వెంటనే ఇప్పటికే షూటింగ్ సగం పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నాడు. ఈసినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈసినిమా తరువాత హరీష్ శంకర్ తో మరో సినిమా చేయనున్నడు పవన్. ఇప్పటికే ఈసినిమా నుండి పలు అప్ డేట్స్ వచ్చాయి. ఇటీవలే పవన్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.

పవన్ కళ్యాణ్ న్యూ మూవీ అప్ డేట్
బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్” చిత్రంతో వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “భీమ్లా నాయక్”మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు . ఈ మూవీ తో పాటు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న”హరిహర వీరమల్లు” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీస్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ తమ మూవీస్ అప్ డేట్స్ రిలీజ్ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

పవన్-హరీష్ మూవీ టైటిల్, రోల్ పై ఇంట్రెస్టింగ్ బజ్
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉండగా ఈసినిమా అయి పోయిన తరువాత క్రిష్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నాడు. ఈరెండు సినిమాల తరువాత సురేందర్ రెడ్డి, అలానే హరీష్ శంకర్ తో సినిమాలు లిస్ట్ లో ఉండగా. రీసెంట్ గానే పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈరెండు సినిమాల నుండి కూడా అప్ డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా.

అందరికీ కృతజ్ఞతలు - పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డేని పురస్కరించుకొని అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అభిమానులతో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పవన్‌కి ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు. ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

పవర్ స్టార్ కు మెగా పవర్ స్టార్ బర్త్ డే విషెస్
కమ్ బ్యాక్ మూవీ బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్”మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “భీమ్లా నాయక్””హరిహర వీరమల్లు” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీస్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులు , అభిమానులు పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెస్ తెలియజేసారు. పవన్ పేరుతో సేవా కార్యక్రమాలు అలానే కేక్ కటింగ్‌లు, భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి అభిమానులు తమ ప్రేమను తెలియజేశారు.

'PSPK 28' జాతర షురూ
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వరుస అప్ డేట్స్ తో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాల అప్‌డేట్స్ వచ్చాయి. ‘భీమ్లా నాయక్’, ‘హరి హర వీర మల్లు’, సురేందర్ రెడ్డి సినిమాల అప్ డేట్లు ఇప్పటికే రాగా.. ఇప్పుడు హరీష్ శంకర్ సినిమా అప్ డేట్ కూడా వచ్చేసింది.

పవన్-సురేందర్ రెడ్డి సినిమా.. న్యూ పోస్టర్ రిలీజ్
రీఎంట్రీ తరువాత పవర్ స్టార్ వరుస సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈఏడాది వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ లిస్ట్ లో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో సురేందర్ రెడ్డితో వస్తున్న సినిమా కూడా ఒకటి. సురేందర్ రెడ్డి, పవన్ కాంబోలో మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి కూడా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సురేందర్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో “యథా కాలమ్ తథా వ్యవహారమ్…” అంటూ ఒక గన్ ను, హైదరాబాద్ లోని చార్మినార్, సైబర్ టవర్ ను చూపించడం ఆసక్తికరంగా ఉంది. ఈ పోస్టర్ ను చూస్తుంటే యాక్షన్ డ్రామా గా ఈసినిమా…

'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ఫిక్స్
ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో నేడు పవన్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే తాజాగా పవన్-క్రిష్ సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు. పవన్-క్రిష్ కాంబినేషన్లో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో హరిహర వీరమల్లు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా చేస్తుండగా.. అది పూర్తయిన వెంటనే ఈసినిమాను మొదలుపెట్టనున్నాడు.

పవర్ స్టార్ కు 'మెగా' బర్త్ డే విషెస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక నేడు పవన్ పుట్టినరోజు రానే వచ్చింది. దీంతో అభిమానులు సోషల్ మీడియా పోస్ట్ లు పెడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకి పలువురు సినీ, రాజకీయ నాయకుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కు తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ అందించారు. "చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్, పవన్ కళ్యాణ్. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా…

పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ అప్ డేట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కే హంగామా చేసే అభిమానులు బర్త్ డే (SEP 2 వ తేదీ )సందర్భంగా పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. పవన్ పేరుతో సేవా కార్యక్రమాలు అలానే కేక్ కటింగ్‌లు భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి తమ ప్రేమను తెలియజేస్తున్నారు. "వకీల్ సాబ్" చిత్రంతో వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పవన్ "భీమ్లా నాయక్"మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు . ఈ మూవీ తో పాటు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న"హరిహర వీరమల్లు" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీస్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ అన్న లెక్క -రామ్ చరణ్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో భారీ బడ్జెట్ , తారాగణం తో తెరకెక్కుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షో లో రామ్ చరణ్ అతిధిగా పాల్గొన్నారు. "ఆర్‌ఆర్‌ఆర్" మూవీ లో ఎన్టీఆర్ పోషించిన కొమురం భీమ్ పాత్ర గురించి ఆసక్తికర విషయాలు చెప్పి రామ్ చరణ్ సినిమా పట్ల క్రేజ్‌ను రెట్టింపు చేశారు. ఇందులో ఎన్నో ఆశ్చర్యపరిచే అంశాలున్నాయనీ , స్క్రీన్ పై తారక్‌ని చూసి అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందేననీ చెప్పారు. కొమురం భీమ్ పాత్రలో నటించడం తనకెంతో ఆనందంగా ఉందనీ, ఆ సినిమా షూట్‌లో మనం…

"హరిహర వీరమల్లు" కెరీర్ కు పెద్ద బూస్ట్ - నిధి అగర్వాల్
“సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. “భూమి “, ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి ప్రస్తుతం మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా రూపొందుతున్న "హరిహర వీరమల్లు" మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

"హరిహర వీరమల్లు "కు మరో భారీ సెట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ "అయ్యప్పనుమ్ కోషియమ్ "తెలుగు రీమేక్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. 50 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది. ఈ మూవీ తో పాటు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “ మూవీ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం లో "PSPK 28 " మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ పై స్టార్ రైటర్ ప్రశంసలు
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు రైటర్ గా పనిచేసిన విజయేంద్ర ప్రసాద్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ రైటర్ గా కొనసాగుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం లో నాగార్జున హీరోగా రూపొందిన "రాజన్న "మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకుంది. ప్రపంచానికి తెలుగు సినిమా సత్తాను చాటిచెప్పిన "బాహుబలి "మూవీ కి కథ ను అందించిన ఘనత విజయేంద్ర ప్రసాద్ దే. సల్మాన్ ఖాన్ "భజరంగి భాయి జాన్ ", కంగనా రనౌత్ "మణికర్ణిక:ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ "బాలీవుడ్ మూవీస్ కు విజయేంద్ర ప్రసాద్ కథలు అందించారు. "తలైవి "(తమిళ ),"రౌద్రం రణం రుధిరం " మూవీస్ కు విజయేంద్ర ప్రసాద్ కథలు అందించారు.

'వకీల్ సాబ్'- 9 పేజీల డైలాగ్..సింగిల్ టేక్
మూడేళ్ల తరువాత వకీల్ సాబ్ తో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంతేకాదు ఈసినిమాలో ముఖ్యంగా కోర్టు సీన్స్ కు మాత్రం మంచి అప్లాజ్ వచ్చింది. ప్రకాష్ రాజ్ అలాగే పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ కానీ.. అలాగే వాదోపవాాదాలు కానీ ఇద్దరూ పోటీ పడిమరీ నటించారు అన్నారు.
పవర్ స్టార్ 'ఫస్ట్ వాల్ పోస్టర్'
సినిమా హిట్ ఫట్ తో సంబంధంలేదు.. ఆయన ఉంటే చాలు కలెక్షన్స్ అలా వచ్చేస్తాయి.. అయనకు ఫ్యాన్స్ కాదు ఉండేది భక్తులు.. టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో పవర్ స్టార్ కు ఉన్న ఇమేజ్, క్రేజ్ వేరు.. ఇప్పటికే ఆ హీరో ఎవరో అర్దమయ్యేవుంటది కదా. ఇంకెవరు.. చిరు తమ్ముడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిరు తమ్ముడిగా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చి తన స్టైల్ తో.. డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కోట్లమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకొని పవర్ స్టార్ అయ్యాడు. అతడ్ని కథానాయకుడిగా ఎంత మంది అభిమానిస్తారో, వ్యక్తిగా అంతకంటే ఎక్కువగా ఆరాధిస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా మారిన క్రేజ్…