మూడేళ్ల తరువాత వకీల్ సాబ్ తో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంతేకాదు ఈసినిమాలో ముఖ్యంగా కోర్టు సీన్స్ కు మాత్రం మంచి అప్లాజ్ వచ్చింది. ప్రకాష్ రాజ్ అలాగే పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ కానీ.. అలాగే వాదోపవాాదాలు కానీ ఇద్దరూ పోటీ పడిమరీ నటించారు అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా.. ఈసినిమాలో నివేథా థామస్ స్నేహితుడిగా, విలన్ బ్యాచ్‌లో ఒకడిగా నటించిన శివ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పవన్ గురించి ఆసక్తికరమైన విషయం చెప్పాడు. క్లైమాక్స్‌కు ముందు వచ్చే సన్నివేశంలో 9 పేజీల డైలాగ్‌ను సింగిల్ టేక్‌లో పవన్ చెప్పి ఆశ్చర్యపరిచాడని.. ఆ సన్నివేశం పూర్తి కాగానే యూనిట్ మొత్తం చప్పట్లు కొట్టి ఆయన్ని అభినందించిందని తెలిపాడు. అంతేకాదు రోజూ ‘వకీల్ సాబ్’ షూట్ అయిపోయాక తామందరం ఇంటికెళ్లి రిలాక్స్ అయితే.. పవన్ మాత్రం రాజకీయ అంశాల్లో బిజీ అయ్యేవారని.. మళ్లీ తర్వాతి రోజు సమయానికి సెట్‌కు వచ్చి కష్టపడేవారని శివ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా వకీల్ సాబ్ రిలీజ్ అవ్వగా ప్రస్తుతం క్రిష్ హరిహర వీరమల్లు సినిమా, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియనుమ్ రీమేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈరెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: