పవర్ స్టార్ ‘ఫస్ట్ వాల్ పోస్టర్’

Powerstar Pawan Kalyan's Rare Wallposter

సినిమా హిట్ ఫట్ తో సంబంధంలేదు.. ఆయన ఉంటే చాలు కలెక్షన్స్ అలా వచ్చేస్తాయి.. అయనకు ఫ్యాన్స్ కాదు ఉండేది భక్తులు.. టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో పవర్ స్టార్ కు ఉన్న ఇమేజ్, క్రేజ్ వేరు.. ఇప్పటికే ఆ హీరో ఎవరో అర్దమయ్యేవుంటది కదా. ఇంకెవరు.. చిరు తమ్ముడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిరు తమ్ముడిగా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చి తన స్టైల్ తో.. డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కోట్లమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకొని పవర్ స్టార్ అయ్యాడు. అతడ్ని కథానాయకుడిగా ఎంత మంది అభిమానిస్తారో, వ్యక్తిగా అంతకంటే ఎక్కువగా ఆరాధిస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా మారిన క్రేజ్ ఏ మాత్రం తగ్గని రేంజ్ ఆయనది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి పవన్ కు మొదట సినిమాలు అంటే అంతగా పెద్ద ఆసక్తి లేదట. ఈ విషయం చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. వదిన సురేఖ ప్రోద్బలంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ చేసిన మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి .ఇందులో నాగార్జున మేనకోడలు సుప్రియ హీరోయిన్. తన మొదటి సినిమాతో పవన్ ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఇక ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా వచ్చిన మొదటి పోస్టరే ఈ పవర్ స్టార్ ‘ఫస్ట్ వాల్ పోస్టర్’. అయితే అప్పుడు అనుకోని ఉండరేమో ఇతనే తెలుగు సినీ చరిత్రలో తనకంటూ పేజీని క్రియేట్ చేసుకుంటాడని.

గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలు ఒక్కో సినిమా హిట్ అవుతూ హీరోగా నిలబెట్టగా ఆ తర్వాత వచ్చిన తొలిప్రేమ టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎంతో గొప్ప ఇమేజ్ ని ఇచ్చింది. ఏ.కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమ సినిమాతో టాలీవుడ్ లో అప్పటివరకూ ఉన్న రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా ఎవరూ ఉహించనంతగా పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన తమ్ముడు మరో బ్లాక్ బస్టర్ కాగా పూరి జగన్నాధ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన బద్రి సినిమా ఒక సెన్షేషన్ ని క్రియోట్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమా ఖుషి. ఖుషి అయితే ఇక ట్రెండ్ సెట్టర్. పవన్ కళ్యాణ్ లైఫ్ లో నే ఆల్ టైం బెస్ట్ మూవీ. ఇందులో లవర్ బాయ్ గా పవన్ యాక్టింగ్, స్టయిల్ పీక్స్ లో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాతో పవన్ రేంజ్ మారిపోడమే కాకుండా..అప్పట్లో యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకొని ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలా వరుస హిట్స్ అందుకున్న పవన్ ఆ తర్వాత చాలా ప్లాప్స్ ను చూసాడు. ఆ తర్వాత జల్సా తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చి గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాలతో మళ్ళీ ఇండస్ట్రీ రికార్డ్స్ చెరిపేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఇక అజ్ఞాతవాసి సినిమా తర్వాత.. ఈ అజ్ఞాతవాసి జనసేన పార్టీ పెట్టి పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లారు. అయితే దాదాపు రెండేళ్ల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

ప్రస్తుతం పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి నటిస్తున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతోపాటు హరీష్ శంకర్, క్రిష్ దర్శకత్వంలో కూడా పవన్ సినిమాలు చేయనున్నాడు. మరి పవన్ సినిమా రావడమే లేట్.. రెండేళ్ల తర్వాత వచ్చినా కూడా ఆయన మళ్ళీ కొత్త రికార్డ్స్ సృష్టిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =