పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియమ్ “తెలుగు రీమేక్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. 50 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది. ఈ మూవీ తో పాటు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “ మూవీ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం లో “PSPK 28 ” మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“హరిహర వీరమల్లు ” మూవీ కై చార్మినార్ సెట్ ను రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొన్ని కీలక సన్నివేశాలకై మరో భారీ ఆగ్రా కోట సెట్ ను రూపొందిస్తున్నట్టు సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. “అయ్యప్పనుమ్ కోషియమ్ “తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసి పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు ” మూవీ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: