కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nithiin New Movie News

ట్యాగ్ · 27 కథనాలు

Nithiin Is All Set To Kickstart His New Movie In August,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nithiin,Actor Nithiin,Hero Nithiin,Nithiin Latest News,Nithiin News,Nithiin Movie,N
సినిమా వార్తలు

ఆగస్ట్ లో హీరో నితిన్ కొత్త చిత్రం ప్రారంభం

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “మాస్ట్రో ” మూవీ మేజర్ షూటింగ్ షెడ్యూల్ గోవా లో జరుగుతుండగా కరోనా సెకండ్ వేవ్ కారణం గా షూటింగ్ నిలిచిపోయింది. దర్శకుడు మేర్లపాక గాంధీ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. “మాస్ట్రో ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉందనీ , 7 రోజుల షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉందనీ చెప్పారు.

Team TFNవాట్సాప్
Youth Star Nithiin Becomes Busy Hero In Tollywood With Back To Back Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Maestro,Maestro Movie,Maestro Telugu Movie,Maestro Movie Update,
సినిమా వార్తలు

బిజీ యంగ్ హీరో నితిన్

సూపర్ హిట్ "జయం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నితిన్ బ్లాక్ బస్టర్ "దిల్ "మూవీ తో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. "ఇష్క్ ", "గుండె జారి గల్లంతయ్యిందే ", చిన్నదాన నీకోసం ", "అ ఆ ", "భీష్మ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నితిన్ కథానాయకుడిగా రూపొందిన "రంగ్ దే !" మూవీ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. పలు మూవీ కమిట్ మెంట్స్ తో హీరో నితిన్ బిజీగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నితిన్ 'ఇష్క్' కు 9ఏళ్లు

ఏన్నో సినిమాల ఫ్లాప్స్ తర్వాత నితిన్ సినీ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయిన సినిమా ఇష్క్. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నితిన్, నిత్య మీనన్ జంటగా నటించిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో నితిన్-నిత్యా మధ్య కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంది. లవ్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకుల మనసును తాకింది. ఈ సినిమాకు మరో హైలైట్ మ్యూజిక్. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం శ్రోతల్ని అలరించింది. దీనితోపాటు ఈ మూవీకి పి సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ , డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

జెట్ స్పీడ్ లో నితిన్

సూపర్ హిట్ "భీష్మ "తరువాత యంగ్ హీరో నితిన్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "రంగ్ దే !" మూవీ మార్చి నెల 6 వ తేదీ రిలీజ్ కానుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "చెక్ "మూవీ ఒక సాంగ్ మినహా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుందని సమాచారం. ఈ మూవీ లో రకుల్ ప్రీత్ , ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గార్జియస్ వైఫ్ కు బర్త్ డే విషెస్

టాలీవడ్ యంగ్ హీరో నితిన్ - షాలిని ల పెళ్లి గత ఏడాది జరిగిన సంగతి తెలిసిందే కదా. కరోనా పరిస్థితులు ఉన్నా కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని.. కొద్దిపాటి బంధువుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. తాజాగా భార్యతో కలిసి తిరుపతి కూడా వెళ్లాడు నితిన్. అంతేకాదు కాలి నడకన ఏడు కొండలు ఎక్కినట్టు.. అదికూడా 2.20 గంటల్లోనే మెట్లు ఎక్కినట్టు నితిన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"రంగ్ దే !" మూవీ అప్ డేట్

పలు బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్న ఇటలీ దేశంలో షూటింగ్స్ జరపడానికై పలు నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ " మూవీ ఇటలీ లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సేఫ్టీ ప్రికాషన్స్ తో "రాధేశ్యామ్ " మూవీ షూటింగ్ సక్సెస్ ఫుల్ గా జరుగుతుంది. ఇప్పుడు మరో చిత్ర యూనిట్ ఇటలీ లో షూటింగ్ కై ప్లాన్ చేసింది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ షెడ్యూల్ సేఫ్ గా పూర్తి

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "రంగ్ దే !"మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. నరేష్ , బ్రహ్మాజీ , వినీత్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Feature story about Nithiin's Dil Movie
సినిమా వార్తలు

నితిన్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ "దిల్ "

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వి వి వినాయక్ దర్శకత్వంలో నితిన్ , నేహ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ "దిల్ " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సూపర్ హిట్ "జయం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నితిన్ తన రెండవ మూవీ "దిల్" లో యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి హీరో గా ఎస్టాబ్లిష్ అయ్యారు. కమెడియన్ వేణు మాధవ్ తన మిమిక్రీ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ పి పట్నాయక్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Rang De Movie Team Plans To Head To Italy For Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

ఇటలీ లో "రంగ్ దే !"

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తి సురేష్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నరేష్ , బ్రహ్మాజీ , వినీత్ , వెన్నెలకిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా "రంగ్ దే " మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నితిన్ కొత్త సినిమా టైటిల్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

భీష్మ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు నితిన్. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా 'రంగ్ దే' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రంగ్ దే సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా.. కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు షూట్ ను మొదలుపెట్టారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్‌ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

నితిన్ 'రంగ్ దే' షూటింగ్ కూడా షురూ

మొత్తానికి టాలీవుడ్ కు ఇప్పుడిప్పుడే పాత రోజులు వస్తున్నాయి. షూటింగ్‌లను స్టార్ట్ చేసి మళ్లీ కళకళాడుతోంది టాలీవుడ్. షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో చకచకా వచ్చి పూర్తి చేసుకుందామనే ఆలోచనలో పడ్డాయి. దీనిలో భాగంగానే ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు షూటింగ్ ను మొదలు పెట్టారు...షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు కూడా. మరికొంతమంది ఇప్పుడిప్పుడే షూటింగ్ లను మొదలుపెడుతున్నారు.

TFN Adminవాట్సాప్
Actor Nithiin Says Yes To Join Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ కు సిద్ధం - నితిన్

"భీష్మ " మూవీ ఘన విజయం సాధించడంతో జోరు మీదున్న యంగ్ హీరో నితిన్ వరస మూవీస్ కు కమిట్ అయ్యారు. సితార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే !" మూవీ లో నితిన్ హీరోగా నటిస్తున్నారు. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో "చెక్ ", బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధా ధున్ " తెలుగు రీమేక్ , కృష్ణ చైతన్య దర్శకత్వంలో "పవర్ పేట " మూవీస్ లో నితిన్ నటిస్తారు.

Team TFNవాట్సాప్
Actor Nithiin Attributes His Next Movie Title To Power Star Pawan Kalyan
సినిమా వార్తలు

హీరో నితిన్ "దిల్ ఖుషి "

యంగ్ హీరో నితిన్ ఈ సంవత్సరం "భీష్మ " మూవీ తో విజయం సాధించి ఆనందం గా ఉన్నారు. వరుస మూవీస్ తో నితిన్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న "రంగ్ దే "మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో కీర్తి సురేష్ కథానాయిక. దర్శకులు చంద్ర శేఖర్ యేలేటి , మేర్లపాక గాంధీ , కృష్ణ చైతన్య మూవీస్ కు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు మరో మూవీ ని అనౌన్స్ చేయనున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నితిన్ 'ఎంగేజ్‌మెంట్‌' - పెళ్లి వేడుకలు షురూ..!

నితిన్-షాలిని పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఫిబ్ర‌వ‌రిలో నితిన్‌, షాలినిల ప‌సుపు, కుంకుమ వేడుక జ‌రిగింది. ఆ త‌ర్వాత పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో లాక్‌డౌన్ వ‌చ్చిప‌డింది. దీంతో పెళ్లి లేట్ అవుతుండటంతో పెళ్ళిచేసేయాలని ఇరు కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. హైద‌రాబాద్‌లో నితిన్ షాలినిల కుటుంబ పెద్ద‌లు ఇరువైపులా తాంబూళాలు మార్చుకుని నిశ్చితార్థం నిర్వ‌హించారు. ఎంగేజ్‌మెంట్‌తో ఐదు రోజుల పెళ్లి సంబ‌రాలు మొదలయ్యాయి. ఇక విషయ్నాన్ని నితిన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఎంగేజ్డ్ అంటూ నితిన్-షాలిని ఎంగేజ్మెంట్ ల ఫొటో ను పోస్ట్ చేసాడు.

TFN Adminవాట్సాప్
Hollywood Make Up Artist Roped In For Nithiin Upcoming Movie With Director Krishna Chaitanya
సినిమా వార్తలు

నితిన్ కోసం హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్..!

చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని 'భీష్మ' సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు నితిన్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన కిక్ తో వరుసగా ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టేసాడు. చంద్రశేఖర్ యేలేటి, 'ఛల్ మోహన్ రంగా' చేసిన కృష్ణచైతన్యతో అలాగే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంధాదున్ రీమేక్ చేస్తున్నాడు నితిన్.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఆగష్ట్ లో మొదలుపెట్టడానికి చూస్తున్న నితిన్..!

''అ ఆ'' లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’తో వరుసగా హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్నాడు నితిన్. దీంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని 'భీష్మ' సినిమాతో వచ్చి సూపర్ హిట్ టాక్ కొట్టాడు.రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Gang Leader Actress Priyanka Arul Mohan Ready To Act In Bold Scenes In Andhadhun Telugu Remake
సినిమా వార్తలు

నితిన్ తో బోల్డ్ సీన్స్ నటించేందుకు రెడీ అయిన నాని హీరోయిన్..!

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ 'అంధాదున్' సినిమా రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను సైతం పూర్తిచేసుకోగా... షూటింగ్ మొదలు పెడదాం అనుకునేలోపు కరోనా వల్ల బ్రేక్ పడింది. అందులో గుడ్డివాడి పాత్రలో నితిన్ నటించబోతున్నాడు. దీనికోసం నితిన్ ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంటున్నాడట.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నితిన్‌కి జోడిగా ప్రియాంకా అరుళ్‌ మోహన్?

'భీష్మ'తో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసాడు యువ కథానాయకుడు నితిన్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. వాటిలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'అంధాదున్' ఒకటి.

Team TFNవాట్సాప్
Mahanati Fame Keerthy Suresh and Nithiin Pair Up Again For Another New Movie
సినిమా వార్తలు

‘భీష్మ’తో ‘మహానటి’?

`భీష్మ‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత యువ క‌థానాయ‌కుడు నితిన్ నుంచి రాబోతున్న‌ చిత్రం `రంగ్ దే`. ఇందులో నితిన్‌కు జోడీగా ‘మ‌హాన‌టి’ ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తోంది. కాగా, ఈ సినిమా విడుద‌ల‌య్యేలోపే.. నితిన్ స‌ర‌స‌న‌ మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో నాయిక‌గా న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుంద‌ట ఈ టాలెంటెడ్ బ్యూటీ.

Team TFNవాట్సాప్
Hero Nithiin Sends Out Message To Public On Containing Coronavirus Together
సినిమా వార్తలు

కరోనా కట్టడి కై హీరో నితిన్ సందేశం

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా వైరస్ భారత్ లో కూడా ప్రభావం చూపుతుండటంతో ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా వైరస్ కట్టడికై కేంద్ర, తెలుగు రాష్ట్రాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. కరోనా వైరస్ నివారణ కై ప్రజలందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా హీరో నితిన్ ప్రజలకు, తన అభిమానులకు ఒక సందేశం ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్