శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “మాస్ట్రో ” మూవీ మేజర్ షూటింగ్ షెడ్యూల్ గోవా లో జరుగుతుండగా కరోనా సెకండ్ వేవ్ కారణం గా షూటింగ్ నిలిచిపోయింది. దర్శకుడు మేర్లపాక గాంధీ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. “మాస్ట్రో ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉందనీ , 7 రోజుల షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉందనీ చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ “కిక్ “, “రేసుగుర్రం “, “టెంపర్ ” మూవీస్ కు రైటర్ గా పనిచేసిన వక్కంతం వంశీ “నా పేరు సూర్య “మూవీ తో దర్శకుడిగా మారారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్ట్ నెలలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. ఈ మూవీ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: