శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వి వి వినాయక్ దర్శకత్వంలో నితిన్ , నేహ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ “దిల్ ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సూపర్ హిట్ “జయం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నితిన్ తన రెండవ మూవీ “దిల్” లో యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి హీరో గా ఎస్టాబ్లిష్ అయ్యారు. కమెడియన్ వేణు మాధవ్ తన మిమిక్రీ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ పి పట్నాయక్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు వినాయక్ తన అద్భుతమైన టేకింగ్ తో “దిల్ ” మూవీని తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 2.5 కోట్ల బడ్జెట్ తో రూపొందిన “దిల్ ” మూవీ 11కోట్లు షేర్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. డిస్ట్రిబ్యూటర్ రాజు కు నిర్మాతగా “దిల్ ” మొదటి సినిమా . ఆ మూవీ తో రాజు “దిల్ రాజు” గా మారి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మిస్తూ టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా రాణిస్తున్నారు. టాలీవుడ్ లో మేజర్ మూవీస్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు త్వరలోనే బాలీవుడ్ కు ఎంటర్ కానున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: