
ట్యాగ్ · 45 కథనాలు


బాలకృష్ణ సర్జరీ వార్తలు అవాస్తవం..!

స్పీడుమీదున్న 'బాలయ్య'

తెలుగు భాష పై బాలకృష్ణ ఛాలెంజ్

అభిమానులకు 'బాలయ్య' రిక్వెస్ట్

మాస్ పోలీస్ , ఫ్యాక్షనిస్ట్ గా బాలకృష్ణ
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ?
సి కళ్యాణ్ బ్యానర్ లో బాలకృష్ణ మరో మూవీ

#NBK106 మూవీ లో బాలకృష్ణ పవర్ ఫుల్ క్యారెక్టర్
వచ్చే ఏడాదే అంటున్న బాలకృష్ణ..!

సినిమా హిట్ కాకుండా ఎక్కడికి పోతుంది

ఎనర్జీకి పవర్ హౌస్ లాంటి వారు మీరు
మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు
అదృష్టానికి అంతరాయం ఏర్పడింది..!

తనయుడి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..!
మోక్షజ్ఞ ఎంట్రీ కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్

బాలకృష్ణ తో సీనియర్ నిర్మాత సినిమా..!

అది ఎన్టీఆర్ ఇష్టం..!

బర్త్ డే కి సర్ ప్రయిజ్ ఇవ్వనున్న బాలయ్య..!

'బాలకృష్ణ' కు కరోనా పాజిటివ్..!
మళ్లీ కరోనా కేసులు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. మళ్లీ కొత్త కేసులు నమోదువుతున్నాయి. ఈనేపథ్యంలోనే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా కరోనా బారినపడ్డారు. తాజాగా, చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. తాను పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నానని బాలకృష్ణ తెలిపారు. గత రెండు రోజులుగా తనని కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతో ఫ్యాన్స్ కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా కరోనా వల్ల సినీ పరిశ్రమకు ఎంత నష్టం జరిగిందో చూశాం. ఆర్థికంగా చాలా నష్టపోయింది. అంతేకాదు ఎంతోమంది సినీ సెసిబ్రిటీలు కరోనా…

బాలకృష్ణ సర్జరీ వార్తలు అవాస్తవం..!
గత ఏడాది అఖండ' సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు నటసింహం బాలకృష్ణ. ఇక ఆ సినిమా తరువాత వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించేశారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. బాలకృష్ణ కెరీర్ లో వస్తున్న 107 సినిమా కావడంతో ఎన్బీకే 107 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

స్పీడుమీదున్న 'బాలయ్య'
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్రహీరోలు కూడా వరుసపెట్టి సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు ఒక్క సినిమాలు చేస్తుంటే వీళ్లు మాత్రం ఒక్కోక్కరూ రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది.ఈసినిమాత తరువాత గోపిచంద్ మలినేని తో మరొక సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా కథ, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాడు గోపిచంద్ మలినేని. అఖండ అయిపోయిన వెంటనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

తెలుగు భాష పై బాలకృష్ణ ఛాలెంజ్
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ఎంటర్ టైనర్ "అఖండ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో "#NBK107 "మూవీ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే.

అభిమానులకు 'బాలయ్య' రిక్వెస్ట్
జూన్ 10వ తేదీన నందమూరి బాలయ్య పుట్టిన రోజు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అభిమానులు ఈరోజు కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కరోనా వల్ల గత ఏడాది తమ అభిమానులకు పుట్టిన రోజు వేడుకులకు దూరంగా ఉండమని ఎలా చెబుతున్నారో.. ఈఏడాది కూడా అలాగే తమ అభిమానులను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా బాలకృష్ణ కూడా సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు.

మాస్ పోలీస్ , ఫ్యాక్షనిస్ట్ గా బాలకృష్ణ
హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ "అఖండ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "అఖండ" మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ , టీజర్ లకు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. "అఖండ "మూవీ తరువాత మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందే ఒక మూవీ కి హీరో బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ?
మాస్ మహారాజా రవితేజ , దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. "క్రాక్ " మూవీ ఘనవిజయం సాధించడంతో దర్శకుడు గోపీచంద్ పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. పలువురు హీరోలు గోపీచంద్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యం లో బాలకృష్ణ మూవీ ఖాయం అయిందని వార్తలు వస్తున్నాయి.
సి కళ్యాణ్ బ్యానర్ లో బాలకృష్ణ మరో మూవీ
హీరో బాలకృష్ణ వరస మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ "BB3" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత ఒక కొత్త దర్శకుడితో ఒక మూవీ కి , సక్సెస్ ఫుల్ "కందిరీగ "మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న "బలరామయ్య బరిలో దిగితే " మూవీ కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

#NBK106 మూవీ లో బాలకృష్ణ పవర్ ఫుల్ క్యారెక్టర్
మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను , బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన "సింహా ", "లెజెండ్ " మూవీస్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా "# NBK106 " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక క్యారెక్టర్ లో బాలకృష్ణ అఘోరా గా కనిపించనున్నారు. "సింహా ", "లెజెండ్ " మూవీస్ లో బాలకృష్ణ రెండో కోణం శక్తిమంతం గా రూపొందిన విషయం తెలిసిందే. బాలకృష్ణ అఘోరా గా ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.
వచ్చే ఏడాదే అంటున్న బాలకృష్ణ..!
లాక్ డౌన్ వల్ల షూటింగ్ లు ఎక్కడికక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం నుండి ఈ సినిమా షూటింగ్స్ కు అనుమతులు వచ్చినా ఇప్పుడప్పుడే షూటింగ్ లకు వెళ్లే ఆలోచనలో మాత్రం ఎవరికీ లేనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే.. లాక్ డౌన్ లో సడలింపులు చేయడం.. రోజు రోజుకు కేసులు కూడా పెరగడమే దీనికి కారణం. మరోవైపు షూటింగ్స్ చేయాలంటే పలు నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది మాత్రం షూటింగ్లను మొదలుపెట్టాలని చూస్తున్నారు... కొంతమంది మాత్రం లేట్ అయినా పర్లేదు అని వెనక్కి తగ్గుతున్నారు.
'శివశంకరీ' పాట ట్రోలింగ్ పై బాలయ్య రియాక్షన్
నందమూరి బాలకృష్ణ స్వభావం గురించి తెలిసిందే. పైకి గంభీరంగా కనిపించినా.. ఆయనిది మాత్రం చిన్నపిల్లల స్వభావమే అని అందరూ అంటుంటారు. అంతేకాదు తనపై వచ్చే విమర్శలను కూడా చాలా లైట్ గా తీసుకుంటారు. ఇప్పుడు మరోసారి తనపై వస్తున్న ట్రోలింగ్ పై చాలా సున్నితంగా స్పందించారు. తన పుట్టినరోజు సందర్భంగా `జగదేకవీరుని కథ` సినిమాలోని `శివశంకరీ` పాటను బాలకృష్ణ స్వయంగా పాడి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటపై సోషల్ మీడియాలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా తలెత్తాయి. ఇక ఈ విమర్శలపై స్పందించిన బాలయ్య.. తన తండ్రి తనకు స్ఫూర్తి ప్రదాత అని ఆయన చెప్పారు. ఆయన నటించిన ఆ సినిమాలోని ఈ పాటంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు…

సినిమా హిట్ కాకుండా ఎక్కడికి పోతుంది
బాలకృష్ణ-బోయపాటి దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటినుండో ఈ సినిమా అప్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా..బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ సినిమా టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ పై బాలకృష్ణ కూడా స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మా కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరంలేదు. మా కాంబినేషనల్ ఇది మూడో సినిమా.. ఎక్కడా టెన్షన్ తీసుకోవడం లేదు...సినిమా హిట్ కాకుండా ఎక్కడికి పోతుంది…

ఎనర్జీకి పవర్ హౌస్ లాంటి వారు మీరు
నందమూరి బాలకృష్ణ ఈ రోజు 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇక బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు బాలకృష్ణకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్, వెంకీ ఇలా పలువురు ఇప్పటికే తమ శుభాకాంక్షలు తెలిపారు. ఇక సూపర్ స్టార్ మహేష్ కూడా బాలకృష్ణకు తన ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు. ఎనర్జీకి పవర్ హౌస్ లాంటి వారు, నేను ఎప్పుడూ అభిమానించే హీరో బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తమ ట్వీట్ లో పేర్కొన్నారు.
మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు
ఈ రోజు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ తో పాటు పలువురు బాలకృష్ణ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు శుభాభినందనలు తెలియజేస్తూ, ట్వీట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. ప్రియమైన బాలకృష్ణా... నువ్వు అరవైల్లోకి అడుగుపెట్టావు. నీ…
అదృష్టానికి అంతరాయం ఏర్పడింది..!
కరోనా వల్ల సెలెబ్రిటీస్ తమ పుట్టినరోజు వేడుకలకు దూరంగా వుంటున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ పుట్టినరోజు వేడుకలు దూరమయ్యారు. అంతేకాదు తమ అభిమానులకు కూడా వేడుకలు జరపొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా బాలకృష్ణ కూడా అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. తన జన్మదిన వేడుకలను మాత్రం ఘనంగా నిర్వహించవద్దని అభిమానులకు బాలయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. స్నేహితులు, అభిమానుల మధ్యలో జన్మదిన వేడుకలు చేసుకునే అదృష్టానికి అంతరాయం ఏర్పడినందుకు బాధగా ఉందని.. కరోనా మహమ్మారి కారణంగా అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అభిమానులెవరినీ కలవడం లేదని బాలకృష్ణ తెలిపారు. ఆరోగ్యాలను…

తనయుడి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..!
తెలుగు తెరపై మన అగ్ర హీరోలు చిరంజీవి తనయుడు రామ్ చరణ్, నాగార్జున తనయుడు నాగచైతన్య ఇప్పటికే వెండితెరపై దూసుకుపోతున్నారు. ఇక వెంకటేష్ తనయుడు అంటే ఇంకా చిన్నోడు కాబట్టి ఎంట్రీ ఇవ్వడానికి చాలా టైమ్ ఉంది. ఇప్పుడు అందరి దృష్టి బాలకృష్ణ తనయుడిపై పడింది. అంతేకాదు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీపై ఇప్పటికే చాలా వార్తలు కూడా వచ్చాయి. గత మూడేళ్ళునుండే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై అనేక వార్తలు వచ్చాయి కానీ ఎప్పుడూ ఆ వార్తలపై క్లారిటీ ఇవ్వలేదు. నందమూరి ఫ్యాన్స్ మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు.
మోక్షజ్ఞ ఎంట్రీ కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్
నందమూరి , అక్కినేని , సూపర్ స్టార్ కృష్ణ , మెగా స్టార్ చిరంజీవి వారసులు టాలీవుడ్ లో హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కై నందమూరి అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ 5సంవత్సరాలుగా నటిస్తారని వార్తలు వస్తున్నాయి గానీ సెట్ కాలేదు. తన వారసుడి టాలీవుడ్ ఎంట్రీ పై బాలకృష్ణ క్లారిఫై చేశారు.

బాలకృష్ణ తో సీనియర్ నిర్మాత సినిమా..!
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్నట్టు ఇంతకుముందే చెప్పిన సంగతి తెలిసిందే.

అది ఎన్టీఆర్ ఇష్టం..!
తన తాత పోలికలే కాదు.. ఆ వాక్చాతుర్యం.. ఆ గాంభీరత్వం అన్ని పుణికి పుచుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సినిమాల్లో ఎలాగూ స్టార్ హీరో అయ్యాడు. అయితే సినిమాలతో పాటు తమ అభిమాన హీరో రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలని చూస్తున్నారు జూనియర్ ఎన్ టి ఆర్ అభిమానులు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కోసం 2009లో ప్రచారాన్ని నిర్వహించారు తారక్. తర్వాత రాజకీయాలకు దూరంగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. ఇక ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు తెరపైకి వచ్చాయి. దానికి కారణం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలే.

బర్త్ డే కి సర్ ప్రయిజ్ ఇవ్వనున్న బాలయ్య..!
తన పుట్టిన రోజుకు తన అభిమానులకు పెద్ద సర్ప్రైజే ప్లాన్ చేసాడు బాలకృష్ణ. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటనుకుంటున్నారా..? ఒక పాటను రిలీజ్ చేయనున్నాడు. బాలకృష్ణ కొత్త సినిమాలో పాట అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అసలు సంగతేంటంటే.. ఎన్టీఆర్ జగదేకవీరుని కథ సినిమాలోని ''శివ శంకరి శివానందలహరి.. శివశంకరి'' పాట గుర్తుండే ఉంటది కదా. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు కంపోజ్ చేసిన ఈ పాటను లెజెండ్ ఘంటసాల పాడగా పింగళి నాగేంద్ర రావ్ రాసారు. ఇక ఈ పాటను ఇప్పటి సింగర్స్ పాడాలన్న చాలా కష్టం. ఆ పాట అలా ఉంటుంది మరి. అయితే ఇప్పుడు ఈ పాటను బాలయ్య పాడటానికి రెడీ అయ్యాడు. మ్యూజిషియన్ యాజమాన్య మ్యూజిక్…