బాలకృష్ణ సర్జరీ వార్తలు అవాస్తవం..!

Balakrishna Undergoing Surgery is a Fake News,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Rumours On Nandamuri Balakrishna’s Surgery Gets Clarified,Nandamuri Balakrishna Latest News,Balakrishna Latest News,Latest News on Nandamuri Balakrishna,Rumours On Balakrishna’s Surgery Gets Clarified,Balakrishna News,Balakrishna Upcoming Movie News

గత ఏడాది అఖండ’ సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు నటసింహం బాలకృష్ణ. ఇక ఆ సినిమా తరువాత వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించేశారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. బాలకృష్ణ కెరీర్ లో వస్తున్న 107 సినిమా కావడంతో ఎన్బీకే 107 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ సర్జరీ గురించి పలు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఈవార్తలు అన్నీ అవాస్తవం అంటున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రతినిధులు ఈ వార్తలపై స్పందించి.. బాలకృష్ణ గారికి ఎటువంటి సర్జరీ జరగలేదు, ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కొరకు మాత్రమే హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది. .దయ చేసి అవాస్తవాలను ప్రచురించవద్దు, వ్యాప్తి చేయవద్దు అని తెలిపారు. అంతేకాదు ఆయన తన కొత్త సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నారు అంటూ ఫేక్ న్యూస్ ను ఖండించారు.

కాగా ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నాడని చెబుతున్నారు. ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =