తనయుడి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..!

Tollywood Veteran Actor Nandamuri Balakrishna Gives Clarity About His Son Mokshagna Debut In To Movies
Tollywood Veteran Actor Nandamuri Balakrishna Gives Clarity About His Son Mokshagna Debut In To Movies

తెలుగు తెరపై మన అగ్ర హీరోలు చిరంజీవి తనయుడు రామ్ చరణ్, నాగార్జున తనయుడు నాగచైతన్య ఇప్పటికే వెండితెరపై దూసుకుపోతున్నారు. ఇక వెంకటేష్ తనయుడు అంటే ఇంకా చిన్నోడు కాబట్టి ఎంట్రీ ఇవ్వడానికి చాలా టైమ్ ఉంది. ఇప్పుడు అందరి దృష్టి బాలకృష్ణ తనయుడిపై పడింది. అంతేకాదు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీపై ఇప్పటికే చాలా వార్తలు కూడా వచ్చాయి. గత మూడేళ్ళునుండే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై అనేక వార్తలు వచ్చాయి కానీ ఎప్పుడూ ఆ వార్తలపై క్లారిటీ ఇవ్వలేదు. నందమూరి ఫ్యాన్స్ మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలావుండగా తనయుడి ఇండస్ట్రీ అరంగేట్రంపై బాలకృష్ణ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ.. నాకు తెలుసు మోక్షజ్ణ ఎంట్రీ గురించి ఎంతగా ఎదురుచూస్తున్నారో.. తానుకూడా సినిమాల్లోకి రావాలని చూస్తున్నాడు.. ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు.. మణికర్ణిక రచయిత బుర్రా సాయిమాధవ్ ప్రస్తుతం కథ రాస్తున్నాడని.. ఈ ఏడాదిలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలిపాడు. త్వరలోనే అధికారిక ప్రకటన ఇస్తామని.. ఫ్యాన్స్ తప్పకుండా మోక్షజ్ణని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్న అని కొడుకు ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేసాడు. క్లారిటీ అయితే వచ్చేసింది… ఇక సినిమా కోసం ఎదురుచూడక తప్పదు.

ప్రస్తుతం బాలయ్య ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య కనిపించనున్నాడట. రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్ర చేయనున్నాడు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =