
ట్యాగ్ · 38 కథనాలు · పేజీ 2


"DEAR మేఘ" సెన్సార్ పూర్తి

'డియర్ మేఘ' రిలీజ్ డేట్ ఫిక్స్

వెంకీ గారి ఆశీస్సులు తీసుకున్నా

'రాజ రాజ చోర' అన్ని భాషల్లో రీమేక్ చేస్తారు

'రాజ రాజ చోర' రిలీజ్ డేట్ ఫిక్స్

'డియర్ మేఘ' టీజర్ రిలీజ్

'పాగల్' తో రకుల్..!

'రాజ రాజ చోర' టీజర్ రిలీజ్

డియర్ మేఘ స్పెషల్ పోస్టర్ రిలీజ్

నలుగురు హీరోయిన్స్ తో 'పాగల్'..!
షూటింగ్ పూర్తిచేసుకున్న 'డియర్ మేఘ'
'డియర్ మేఘ' ఫస్ట్ లుక్ రిలీజ్
మేఘా ఆకాష్ స్టైలిష్ లుక్
'గుర్తుందా శీతాకాలం' - అతిథి పాత్రలో మేఘ
మేఘా ఆకాష్ కు బాలీవుడ్ ఆఫర్

"మనుచరిత్ర"మూవీ టీజర్ రిలీజ్
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సమర్పణలో ఆపిల్ ట్రీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై భరత్ కుమార్ పి దర్శకత్వంలో "చూసీ చూడంగానే" మూవీ ఫేమ్ శివ కందుకూరి , మేఘ ఆకాష్ జంటగా "మనుచరిత్ర"మూవీ తెరకెక్కింది. ధనంజయ్ , ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ ముఖ్య పాత్రలలో నటించారు. గోపీసుందర్ సంగీతం అందించారు.

ఓటీటీలో 'రాజ రాజ చోర'.. రిలీజ్ డేట్ ఫిక్స్
హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా రాజ రాజ చోర. ఇక ఈసినిమా కరోనా సెకండ్ వేవ్ తరువాత రిలీజ్ అయిన సినిమా. కామెడీ ఎంటర్ టైనర్ గా ఆగష్ట్ 19న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. అక్టోబరు 8 నుంచి ‘జీ 5’లో స్ట్రీమింగ్‌కానునట్టు జీ5 సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

"DEAR మేఘ" సెన్సార్ పూర్తి
వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ , సోరింగ్ ఎలిఫెంట్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అరుణ్ ఆదిత్, మేఘ ఆకాష్ జంటగా తెలుగు , తమిళ భాషలలో రూపొందిన "DEAR మేఘ" మూవీ సెప్టెంబర్ 3 వ తేదీ రిలీజ్ కానుంది. అర్జున్ సోమయాజులు ఒక కీలక పాత్రలో నటించారు. కన్నడ హిట్ "దియా "మూవీ కి రీమేక్ గా రూపొందిన "DEAR మేఘ" మూవీ కి హరి గౌర సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'రాజ రాజ చోర' రివ్యూ
పాటలు సంగతి పక్కన పెడితే వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యాజిక్ మాత్రం ఆకట్టుకుంటుంది. వేద రామన్ సినిమాటోగ్రఫీ, సినిమా నిర్మాణ విలువలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇక ఫైనల్ గా కామెడీ చిత్రాలను మన ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు.. ఇక ఈసినిమా కూడా బాగానే ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు.

'డియర్ మేఘ' రిలీజ్ డేట్ ఫిక్స్
అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ “డియర్ మేఘ”. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ రిలీజ్ కాగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఈసినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆవార్తలను కొట్టిపారేస్తూ రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్రయూనిట్. . సెప్టెంబర్ 3న థియేటర్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

వెంకీ గారి ఆశీస్సులు తీసుకున్నా
హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు రాజ రాజ చోర అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఈనెల 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా శ్రీ విష్ణు స్పీడు పెంచాడు. నిజానికి ఇప్పటివరకూ తన సినిమాల గురించి ఎప్పుడూ మాట్లాడనంతగా ఈసినిమా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు శ్రీ విష్ణు. అంతేకాదు వెంకీ నారప్ప గురించి కూడా మాట్లాడిన సంగతి తెలిసిందే కదా. 'విక్టరీ వెంకటేష్ గారికి నేను వీరాభిమానిని. నారప్ప చిత్రం ఓటిటిలో రిలీజ్ కావడం బాధగా అనిపించింది. రెండు రోజుల పాటు భోజనం కూడా చేయలేదు. సూపర్ స్టార్స్ నటించే చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కావాలంటే ముందుగా చిన్న చిత్రాలకు…

'రాజ రాజ చోర' అన్ని భాషల్లో రీమేక్ చేస్తారు
శ్రీ విష్ణు సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. మొదటి నుండి కాస్త వైవిధ్యంగా ఉన్న సినిమాలనే తను ఎంచుకుంటాడు. అందుకే ప్రేక్షకులకు కూడా శ్రీవిష్ణు సినిమాలంటే ఏదో ఒక డిఫరెంట్ ఉంటుందని చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ఇప్పుడు రాజ రాజ చోర అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ఈనెల 19న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇక ఈసందర్బంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'రాజ రాజ చోర' రిలీజ్ డేట్ ఫిక్స్
కెరీర్ ప్రారంభం నుండి కాస్త డిఫరెంట్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ఇక ఇటీవలే గాలిసంపత్ తో అలరించిన శ్రీవిష్ణు ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాలతో వచ్చేస్తున్నాడు. అందులో రాజ రాజ చోర సినిమా కూడా ఒకటి. ఇక ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక శ్రీవిష్ణు సినిమా అందులోనూ రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

'డియర్ మేఘ' టీజర్ రిలీజ్
అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ “డియర్ మేఘ”. అర్జున్ సోమయాజులు మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ కాగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఎలాగూ థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్.

'పాగల్' తో రకుల్..!
ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు హీరోయిన్స్. ఇప్పటికే తమన్నా, కాజల్ ఎంట్రీ ఇవ్వగా.. రీసెంట్ గా సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూాడా డిటిటల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. ఈ హీరోయిన్ ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్.

'రాజ రాజ చోర' టీజర్ రిలీజ్
హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రాజ రాజ చోర అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంగా.. ఇన్ని రోజులు కరోనా వల్ల ఈసినిమా నుండి అప్ డేట్స్ ఇవ్వలేదు. రీసెంట్ గానే ఈసినిమా నుండి అప్ డేట్స్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ వాయిస్ ఓవర్‌తో విడుదల చేసిన 2డీ వీడియోను రిలీజ్ చేయాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

డియర్ మేఘ స్పెషల్ పోస్టర్ రిలీజ్
మేఘ సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో మేఘ ఆకాష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'డియర్ మేఘ'. ఇటీవలే ఈ సినిమానుండి మేఘ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేఘ ఈసారి విభిన్నమైన పాత్రతో వస్తుందని అర్థమైంది. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. త్వరలో ఓ బిగ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా ‘డియర్ మేఘ’ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నలుగురు హీరోయిన్స్ తో 'పాగల్'..!
ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా 'పాగల్' సినిమా చేస్తున్నాడు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
షూటింగ్ పూర్తిచేసుకున్న 'డియర్ మేఘ'
మేఘ సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో మేఘ ఆకాష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'డియర్ మేఘ'. ఇటీవలే ఈ సినిమానుండి మేఘ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేఘ ఈసారి విభిన్నమైన పాత్రతో వస్తుందని అర్థమైంది. ఇక ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీ గా ఉన్న చిత్రయూనిట్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అంతేకాదు కేవలం 28 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి అడుగుపెట్టిన ఈ సినిమాను త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
'డియర్ మేఘ' ఫస్ట్ లుక్ రిలీజ్
‘చల్ మోహనరంగ, లై’ సినిమాలతో ఆకట్టుకున్నా సరైన హిట్ అందుకోలేకపోయింది నటి మేఘ. ఆ తర్వాత తెలుగులో పెద్దగా ఛాన్స్ లు కూడా రాలేదు. అయితే ఈ గ్యాప్ లో తమిళ్ లో సినిమాలు చేసింది. వరుస అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ ఈ అమ్మడు మాత్రం ఇప్పటివరకూ సక్సెస్ టేస్ట్ మాత్రం చూడలేకపోతుంది.
మేఘా ఆకాష్ స్టైలిష్ లుక్
యాక్షన్ థ్రిల్లర్ "లై " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మేఘా ఆకాష్ , ఆ మూవీ లో తన అందం , హుషారైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "ఛల్ మోహన్ రంగ "మూవీ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన "పేట్ట "మూవీ తో మేఘా ఆకాష్ కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. తమిళ మూవీస్ లో బిజీగా మారారు. మేఘా ఆకాష్ ప్రస్తుతం "మను చరిత్ర "తెలుగు మూవీ , విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
'గుర్తుందా శీతాకాలం' - అతిథి పాత్రలో మేఘ
నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్లుగా కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాను తెలుగులో గుర్తుందా శీతాకాలం పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ముందు చెప్పినట్టే సింగల్ షెడ్యూల్ లోనే ఈ సినిమా షూట్ ను పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు. దీనిలోభాగంగానే నిర్విరామంగా షూటింగ్ జరుపుతున్నారు.
మేఘా ఆకాష్ కు బాలీవుడ్ ఆఫర్
యాక్షన్ థ్రిల్లర్ "లై " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మేఘా ఆకాష్ "ఛల్ మోహన్ రంగ" మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ "పేట " మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించారు. మేఘా ఆకాష్ ప్రస్తుతం "మనుచరిత్ర "(తెలుగు ), ఒక తమిళ మూవీ లో నటిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ బిగ్ మూవీ లో మేఘా ఆకాష్ కు ఆఫర్ వచ్చింది.