‘రాజ రాజ చోర’ రివ్యూ

Read Through The Review Of Sree Vishnu Starrer Raja Raja Chora Movie Released Today,Raja Raja Chora Telugu Movie Review,Sree Vishnu,Megha Akash,Sunainaa,Hasith Goli,Telugu Filmnagar,Raja Raja Chora Movie Review,Raja Raja Chora Movie Trailer,Raja Raja Chora Review,Raja Raja Chor,Raja Raja Chora Movie,Raja Raja Chora Telugu Movie,Raja Raja Chora Update,Raja Raja Chora Telugu Full Movie,Raja Raja Chora Movie Live Updates,Raja Raja Chora Movie Story,Raja Raja Chora Public Talk,Raja Raja Chora Movie Public Talk,Raja Raja Chora Movie Public Response,Sree Vishnu Raja Raja Chora Telugu Movie Review,Raja Raja Chora Telugu Movie Review And Rating,Raja Raja Chora Movie Rating,Raja Raja Chora Movie Release Updates,Raja Raja Chora Review And Rating,2021 Latest Telugu Movie Reviews,Raja Raja Chora Movie Review And Rating,Raja Raja Chora Telugu Movie Public Talk,Raja Raja Chora 2021 Latest Telugu Movie,Sree Vishnu Raja Raja Chora,Raja Raja Chora Latest Updates,Raja Raja Chora Songs,Raja Raja Chora Trailer,Sree Vishnu New Movie,Sree Vishnu Latest Movie,Sree Vishnu Movies,Sree Vishnu And Megha Akash Movie,Raja Raja Chora Movie Updates,Sree Vishnu Raja Raja Chora Movie Review,Sree Vishnu Raja Raja Chora Movie,Latest Telugu Reviews,Megha Akash Movies,Latest Telugu Movie 2021,Telugu Movie Reviews,Latest Telugu Movie Reviews,#RajaRajaChora

హసిత్‌ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునయన హీరో హీరోయినస్ గా తెరకెక్కిన సినిమా రాజ రాజ చోర. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది.. శ్రీ విష్ణుకు ఎలాంటి ఫలితాన్ని అందించింది అన్న విషయం తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు: శ్రీవిష్ణు, మేఘా ఆకాష్‌, సునయన, రవిబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, అజయ్‌ ఘోష్‌, గంగవ్వ తదితరులు
దర్శకత్వం: హసిత్‌ గోలి
నిర్మాతలు: అభిషేక్‌ అగర్వాల్‌, టీజీ విశ్వ ప్రసాద్‌
సంగీతం: వివేక్‌ సాగర్‌
సినిమాటోగ్రఫీ: వేద రమణ్‌ శంకరన్‌

కథ.. భాస్క‌ర్ (శ్రీవిష్ణు) స్టేషన‌రీ షాప్‌లో ప‌నిచేస్తుంటాడు కానీ అందరికీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని చెప్పుకుంటూ ఉంటాడు. అంతేకాదు అవసరాలకు దొంగతనాలు కూడా చేస్తాడు. మరోవైపు సంజ‌న (మేఘ ఆకాష్‌)తో ప్రేమాయ‌ణం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో సంజనకు అసలు నిజం తెలుస్తుంది. భాస్క‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాదనీ… తనకు ఇది వరకే విద్య (సునయన) అనే మ‌రో అమ్మాయితో పెళ్లి అయిందని, కొడుకు కూడా ఉన్నాడని తెలుస్తుంది. దీనికి తోడు విలియం రెడ్డి (రవి బాబు) భాస్కర్ ను దొంగతనం కేసులో ఇరికించడానికి చూస్తుంటాడు.. మరి నిజంగానే భాస్కర్ కు ముందే పెళ్లి అయిందా..ఇంతకీ విద్య ఎవరు? విలియం రెడ్డి వల్ల భాస్కర్ జీవితం ఎలా మలుపు తిరిగింది? చివరకు భాస్కర్ ప్రేమ ఎమవుతుంది..? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

శ్రీ విష్ణు సినిమా అంటే మినిమం గ్యారెంటీ సినిమా అని అందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. దానికి తను ఎంచుకునే కథలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి నుండి తన ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటాడు. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ నే నమ్ముకోకుండా.. కూల్ గా కథలు చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పించేస్తాడు. ఇక ఇప్పుడు రాజ రాజ చోర సినిమాతో దొంగ గా మారి నవ్వించాడు. ఈసినిమాకు ప్లస్ పాయింట్ శ్రీ విష్ణునే.. ఎలాంటి హడావుడి లేకుండా ఎప్పటిలాగే చాలా సైలెంట్ గా కామెడీని పండించేశాడు. దానికి తోడు కథ కథనం కూడా బాగా సెటయ్యాయి. అబద్దాలు చెప్పడం, దొంగతనాలు చేయడంతో శ్రీ విష్ణు కామెడీ పండించాడు. మేఘ ఆకాష్, సునయన పాత్ర‌లు కూడా ఈ క‌థ‌లో కీల‌కం. మేఘ అందంగా క‌నిపించ‌డమే కాదు, ఆమె అభిన‌యం కూడా ఆక‌ట్టుకుంటుంది. గృహిణి పాత్ర‌లో సునయన కూడా మెప్పిస్తుంది. పోలీస్ అధికారిగా ర‌విబాబు ఒదిగిపోయిన తీరు బాగుంది. ఇక గంగ‌వ్వ, శ్రీకాంత్ అయ్యంగ‌ర్‌, అజ‌య్ ఘోష్, త‌నికెళ్ల భ‌ర‌ణి త‌దిత‌రులు తమ పాత్రల మేర మెప్పించారు.

ఇక కామెడీ, లవ్, ఎమోషన్ ట్రాక్ ఇలా అన్నింటిని సమానంగా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు హ‌సిత్ గోలి. ఫస్ట్ హాఫ్ అంతా భాస్కర్ దొంగతనాలు, అబద్దాలు చెప్పడం, హీరోయిన్ తో లవ్ స్టోరీతో నడిపించేశాడు. సెకండాఫ్‌లో ఎక్కువగా భాస్కర్, సునైన పాత్ర‌, ర‌విబాబు పాత్ర‌లతో కథ నడుస్తుంది.ఇక ఫైనల్ గా అబద్దాలు అప్పటికప్పుడు ఉపయోగపడినా అవి ఎప్పుడూ పనిచేయవు.. అబ‌ద్దాలు బంధాల‌ను నిల‌ప‌వు అన్న పాయింట్ ను చూపించాడు డైరెక్టర్.

పాటలు సంగతి పక్కన పెడితే వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యాజిక్ మాత్రం ఆకట్టుకుంటుంది. వేద రామ‌న్ సినిమాటోగ్ర‌ఫీ, సినిమా నిర్మాణ విలువ‌లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇక ఫైనల్ గా కామెడీ చిత్రాలను మన ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు.. ఇక ఈసినిమా కూడా బాగానే ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here