ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు హీరోయిన్స్. ఇప్పటికే తమన్నా, కాజల్ ఎంట్రీ ఇవ్వగా.. రీసెంట్ గా సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూాడా డిటిటల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. ఈ హీరోయిన్ ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎ.ఎల్.విజయ్.. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో ఓ ప్రముఖ ఓటీటీ కోసం సినిమా ఒకటి తెరకెక్కతోంది. అక్టోబర్ 31.. లేడీస్ నైట్ పేరుతో ఈ ఫిలిం రూపొందుతుంది. ఒక హాలోవీన్ నైట్లో జరిగే అనూహ్య ఘటనల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందట. ఇక ఇందులో ఓ కీలక పాత్రకు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రకుల్ మాత్రమే కాదు ఇందులో నివేదా పేతురాజ్, మంజిమా మోహన్, మేఘా ఆకాష్, విద్యుల్లేఖ, రెబెక్కా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఇందులో విశ్వక్ సేన్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడన్నది ఆసక్తికరం. ఇక తెలుగుతోపాటు ఈ చిత్రాన్ని తమిళం, హిందీల్లోనూ రిలీజ్ చేయబోతున్నారట. మరి ఇందులో రకుల్ ఉందో లేదో తెలియాలంటే క్లారిటీ వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇంకా అజయ్ దేవ్గన్, అమితాబ్ బచ్చన్, అంగిరాధర్ సినిమాల్లో నటిస్తుంది. ఇక తమిళనాట కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























