యాక్షన్ థ్రిల్లర్ “లై ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మేఘా ఆకాష్ “ఛల్ మోహన్ రంగ” మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ “పేట ” మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించారు. మేఘా ఆకాష్ ప్రస్తుతం “మనుచరిత్ర “(తెలుగు ), ఒక తమిళ మూవీ లో నటిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ బిగ్ మూవీ లో మేఘా ఆకాష్ కు ఆఫర్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




రీల్ లైఫ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ , సొహైల్ ఖాన్ ప్రొడక్షన్స్ , సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ , దిశా పటాని జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “రాధే ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో మేఘా ఆకాష్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. ఈ అవకాశం పట్ల మేఘా ఆకాష్ సంతోషం గా ఉన్నారు. మేఘా ఆకాష్ మాట్లాడుతూ .. ప్రభుదేవా సార్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ తో నటించడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, తొలి రోజు షూటింగ్ లో సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యూమన్ సంస్థ టీ షర్ట్స్ ను సల్మాన్ ఖాన్ తనకు గిఫ్ట్ గా ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























