శ్రీ విష్ణు సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. మొదటి నుండి కాస్త వైవిధ్యంగా ఉన్న సినిమాలనే తను ఎంచుకుంటాడు. అందుకే ప్రేక్షకులకు కూడా శ్రీవిష్ణు సినిమాలంటే ఏదో ఒక డిఫరెంట్ ఉంటుందని చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ఇప్పుడు రాజ రాజ చోర అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ఈనెల 19న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇక ఈసందర్బంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా ఇండియాలో ఉన్న అన్ని ప్రధాన భాషల్లోనూ రీమేక్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. అంతేకాదు ఈ సినిమాకు వెళ్లే వాళ్లు ఖచ్చితంగా ఆరు మాస్కులు తీసుకెళ్లాలని విష్ణు అన్నాడు. ఫస్ట్ హాఫ్ లో నవ్వి నవ్వి ఒక్కో మాస్కు ఊడిపోతుందని.. సినిమా సగం అయ్యేసరికే మూడు మాస్కులు కావాలని.. ఇక సెకండ్ హాఫ్ లో ఎమోషన్ వల్ల ఏడ్చి ఏడ్చి మాస్కులు తడిచిపోతాయని.. కాబట్టి మరో మూడు మాస్కులు అవసరమని విష్ణు అన్నాడు. మరి చూద్దాం శ్రీ విష్ణు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే సినిమా ఎలా ఉంటుందో..
కాగా హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునయన ముఖ్యపాత్ర పోషిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, రవిబాబు,కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్,వాసు ఇంటూరి తదితరులు నటిస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: