
ట్యాగ్ · 351 కథనాలు · పేజీ 8


సూపర్ స్టార్ కు మెగాస్టార్ బర్త్ డే విషెస్..!

సీనియర్ హీరో బర్త్ డే సెలబ్రేషన్స్ లో 'చిరు'

సూర్య కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..!

చిరు సమర్పణలో 'లాల్ సింగ్ చద్దా'

రాజ్యసభ సభ్యత్వం పై చిరు స్పందన..!

మారుతి తో చిరు ఫిక్స్..!

'పక్కా కమర్షియల్' ముఖ్య అతిథిగా చిరు..!

అగ్రహీరోలతో సల్మాన్ పార్టీ..!

కమల్ హాసన్ కు మెగా స్టార్ చిరంజీవి సన్మానం

'బ్రహ్మాస్త్ర' కోసం మెగాస్టార్!

చిరంజీవి బ్యాక్ టు వర్క్

'మెగాస్టార్' తో సినిమా రూమర్స్ పై క్లారిటీ..!
సింగర్ కె.కె మృతి.. మెగా హీరోల సంతాపం..!

టాలీవుడ్ స్టార్ హీరోల ప్రస్తుత షూటింగ్ లొకేషన్స్

ఆచార్య మూవీ పబ్లిక్ టాక్

'ఆచార్య' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

గాడ్ ఫాదర్ నుండి వచ్చేస్తున్న టీజర్.. డేట్ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “గాడ్ ఫాదర్”. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ‘లూసిఫర్ ‘ సినిమాకు రీమేక్ గా ఈసినిమా వస్తుంది. ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే చిరు కూడా తన డబ్బింగ్ ను స్టార్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈనెల 21వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరి చిరు పుట్టినరోజు ఆగష్ట్ 22వ…

మెగా లుక్
దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న మెగా స్టార్ చిరంజీవి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. యువ హీరోల తో పోటీపడుతూ చిరంజీవి పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా “గాడ్ ఫాదర్ “, బాబీ “MEGA 154 “, మెహెర్ రమేష్ “భోళా శంకర్ “మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. చిరంజీవి ప్రస్తుతం ఈ మూడు సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.

సూపర్ స్టార్ కు మెగాస్టార్ బర్త్ డే విషెస్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. మహేష్ ఏమో కానీ ఫ్యాన్స్ మాత్రం ఈరోజు కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లోనే రికార్డ్ క్రియేట్ చేసిన పోకిరి ఇంకా ఒక్కడు సినిమాలను స్పెషల్ షోస్ ను నిర్వహిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇప్పుడు కూడా స్పెషల్ షోస్ కు సూపర్ రెస్పాన్స్ రావడం. ఇక ఈ షోస్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఎంబీ ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లల గుండె ఆపరేషన్, పేద పిల్లల విద్యకు విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిపిన సంగతి కూడా విదితమే.

సీనియర్ హీరో బర్త్ డే సెలబ్రేషన్స్ లో 'చిరు'
నవరస నటనా సార్వభౌముడిగా ఆరు దశాబ్ధాలపాటు తన సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రల్లో నటించారు కైకాల సత్యనారాయణ. సామాజిక, పౌరాణిక సినిమాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రల ద్వారా అలరించారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నారు లాంటి దిగ్గజాలతో సమానంగా కైకాల సత్యనారాయణ పాత్రలు ఉండేవి. ఒక అన్న పాత్ర అయినా, తండ్రి పాత్ర అయినా, కరడు కట్టిన విలన్ పాత్ర అయినా ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రకు జీవం పోసేవారు. తన సినీ ప్రయాణలో ఇప్పటి వరకూ దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు కైకాల సత్యనారాయణ.

సూర్య కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..!
తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క విభిన్నమైన కథలను చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ఇక వాటి ఫలితాలను చూస్తూనే ఉన్నాం. ఇక సూర్య పుట్టిన రోజుకు ఒకరోజు ముందు సూర్య సినిమాకు ఇన్ని జాతీయ అవార్డులు రావడం గొప్ప విషయమనే చెప్పాలి. ఇక నేడు సూర్య తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఫ్యాన్స్, సినీ సెలబ్రెటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

చిరు సమర్పణలో 'లాల్ సింగ్ చద్దా'
అద్వైత్ చందన్ దర్శకత్వంలో బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్, టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు నాగచైతన్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా. ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఇప్పటికే ఈసినిమా ప్రివ్యూ చిరంజీవి ఇంట్లోనే వేయడం జరిగింది. ఇక ఈ ప్రివ్యూను చిరు తో పాటు నాగార్జున, రాజమౌళి, సుకుమార్, నాగచైతన్య కూడా చూశారు.

రాజ్యసభ సభ్యత్వం పై చిరు స్పందన..!
సినీ పరిశ్రమ నుండి రాజ్యసభ సభ్యులుగా ప్రముఖ సంగీత దర్శకుడు మ్యాస్ట్రో ఇళయరాజాను అలానే ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ను నియమిస్తున్నట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈమేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తమ ట్విట్టర్ ద్వారా వారికి అభినందనలు తెలుపుతూ మరీ పోస్ట్ చేశారు.

రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో మెగా స్టార్ చిరంజీవి కి అభిమానుల ఘనస్వాగతం
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు భీమవరంలో జరగనున్న విషయం తెలిసిందే.భీమవరంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్న అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొంటారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న చిరంజీవికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున మెగా అభిమానులు అక్కడికి తరలివచ్చారు.చిరంజీవి కి అభిమానులు భారీ గజ మాలతో వెల్‌కమ్ చెప్పారు. ఈ క్రమంలోనే చిరంజీవి వారిని అభివాదం చేస్తూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. చిరంజీవి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భీమవరం చేరుకుంటారు.

మారుతి తో చిరు ఫిక్స్..!
ఇటీవలే ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ఒక సినిమా, మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో సినిమా, బాబి దర్శకత్వంలో ఇంకో సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో కూడా మరో సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా చిరు మరో సినిమాను ప్రకటించాడు.

'పక్కా కమర్షియల్' ముఖ్య అతిథిగా చిరు..!
వరస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు డైరెక్టర్ మారుతి. ప్రస్తుతం మారుతి తెరకెక్కిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా చేస్తున్న ఈసినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. జూన్ 26వ తేదీన ఈ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ఇక ఈకార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్టు మేకర్స్ తెలియచేశారు. చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు…

అగ్రహీరోలతో సల్మాన్ పార్టీ..!
మన టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ హీరోలకు మధ్య ఎప్పటినుండో ప్రత్యేకమైన అనుబంధం ఉందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇంకా పరిస్థితులు మారడంతో కలిసి సినిమాలు కూడా చేసే రోజులు వచ్చాయి. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సైతం చిరంజీవి సినిమాలో అది కూడా ఒక పాత్రలో నటిస్తున్నాడంటేనే చెప్పొచ్చు సినీ పరిశ్రమల్లో ఎంత మార్పు వచ్చిందో. ఇక సల్మాన్ తో చిరంజీవి, వెంకటేష్ కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక తాజాగా వీరు ముగ్గురు కలిసి ఒక పార్టీకి హాజరవ్వడం ఆ ఫొటోలు కాస్త బయటకు రావడంతో వైరల్ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లోనే ఉన్నాడు. ఈనేపథ్యంలోనే…

కమల్ హాసన్ కు మెగా స్టార్ చిరంజీవి సన్మానం
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేక పాత్రలో కనిపించిన సూర్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.ప్రపంచవ్యాప్తంగా వారం రోజులలో 250…

'బ్రహ్మాస్త్ర' కోసం మెగాస్టార్!
బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తుంది ఈసినిమా. పాన్ ఇండియా వైడ్ గా ఈసినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. అందుకే ఈసినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ను బట్టి ఈసినిమా మంచి విజువల్ ట్రీట్ అయితే ఇవ్వబోతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే ఈసినిమాలో పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈసినిమాలో టాలీవుడ్ నుండి అగ్రహీరో నాగార్జున కూడా నటిస్తుండటంతో సౌత్ నుండి కూడా బాగానే సపోర్ట్ అందుతుంది. మరోవైపు రాజమౌళికి బ్రహ్మాస్త్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్ కు మధ్య మంచి రాపో ఉండటంతో సౌత్…

చిరంజీవి బ్యాక్ టు వర్క్
మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఒకే సారి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ, సీనియర్ హీరోయిన్ రాధిక స్వంత బ్యానర్ రాడాన్ మీడియా వర్క్స్ లో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిరంజీవి హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయని సమాచారం.

'మెగాస్టార్' తో సినిమా రూమర్స్ పై క్లారిటీ..!
ఇటీవలే మెగాస్టార్ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు చిరంజీవి. ఇక ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ ను గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా దీనితో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా ఇంకా బాబితో మరో సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలు అన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి.
సింగర్ కె.కె మృతి.. మెగా హీరోల సంతాపం..!
సినీ పరిశ్రమలు గత రెండేళ్ల నుండి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఇప్పటికే రెండేళ్లపాటు ఆర్థికంగాచాలా నష్టపోయింది. దానికితోడు ఎంతో మంది నటీనటులు మృతిచెందుతున్నారు. ఈ మధ్యకాలంలోనే బాల సుబ్రహ్మణ్యం, సిరివెన్నెల సీతారామశాస్త్రి, లతా మంగేష్కర్ లాంటి లెంజెండరీస్ ను కోల్పోగా.. పునీత్ రాజ్ కుమార్ లాంటి స్టార్ హీరో తోపాటు పలువురు అతి చిన్న వయసులోనే మరణించారు. ఇక ఇప్పుడు మరో విషాదఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్ కె.కె (కృష్ణ కుమార్ కునాథ్) కన్నుమూశారు. మంగళవారం కోల్‌కత్తాలో కె.కె లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్లగా అక్కడ ప్రోగ్రామ్ అయిన కొంతసేపటికి సడన్‌గా అనారోగ్యానికి…

టాలీవుడ్ స్టార్ హీరోల ప్రస్తుత షూటింగ్ లొకేషన్స్
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు తమ తమ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ మినహా మిగతా హీరోలు అందరూ హైదరాబాద్ లో పలు లోకేషన్స్ లో జరుగుతున్న షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న "గాడ్ ఫాదర్ "మూవీ శంకరపల్లి సెట్ లో జరుగుతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న "NBK107"మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది.

ఆచార్య తెలుగు మూవీ రివ్యూ
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఆచార్య ఒక ఎమోషనల్ సీరియస్ డ్రామా అని చెప్పొచ్చు. ఈసినిమాను మెగా అభిమానులు ఎలాగూ చూసేస్తారు. అయితే మిగిలిన సినీ ప్రేక్షకులు కూడా ఒక సారి చూసి ఎంజాయ్ చేయోచ్చు.

ఆచార్య మూవీ పబ్లిక్ టాక్
#Acharya #RamCharan & Megastar #Chiranjeevi Both are Screen presents are Super. Complete action Mass Entertainment🔥 Super HIT All centre HIT…

'ఆచార్య' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ లో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ తో పాటు ప్రతి సినీ లవర్ ఎంత ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య కాలంలో అలాంటి ఎగ్టైజ్ మెంట్ ను తీసుకొచ్చిన సినిమాల్లో పవన్-రానా కాంబినేషన్ లో వచ్చిన భీమ్లానాయక్ అలానే ఎంతో కాలంగా ఎదురుచూసిన ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా. ఈరెండు సినిమాలు రిలీజ్ అయిపోయాయి బ్లాక్ బస్టర్లు కూాడా కొట్టాయి. ఇప్పుడు అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తుంది ఆచార్య సినిమా కోసం. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవడంతో సినిమాకోసం అటు మెగా ఫ్యాన్స్ మాత్రమే…