చిరు సమర్పణలో ‘లాల్ సింగ్ చద్దా’

Megastar Chiranjeevi to present Laal Singh Chaddha in Telugu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Megastar Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi to Present Laal Singh Chaddha in Telugu,Laal Singh Chaddha,Laal Singh Chaddha Movie,Laal Singh Chaddha Movie Updtaes, Laal Singh Chaddha Telugu Movie,Laal Singh Chaddha Movie Latest Updates,Laal Singh Chaddha Chiranjeevi Present it in Telugu,Laal Singh Chaddha Amir Khan and Nagachaitanya, Naga Chaitanya Upcoming Movie in Bollywood Laal Singh Chaddha,Amir Khan Upcoming Movies,Amirkhan New Movie Updates

అద్వైత్ చందన్ దర్శకత్వంలో బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్, టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు నాగచైతన్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా. ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఇప్పటికే ఈసినిమా ప్రివ్యూ చిరంజీవి ఇంట్లోనే వేయడం జరిగింది. ఇక ఈ ప్రివ్యూను చిరు తో పాటు నాగార్జున, రాజమౌళి, సుకుమార్, నాగచైతన్య కూడా చూశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమాకు మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ యాడ్ అయింది. ఈసినిమా తెలుగు వెర్షన్ ను చిరు సమర్పిస్తున్నారు. ఈసందర్భంగా చిరు తాజాగా తన ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘కొన్ని సంవత్సరాల క్రితం నా ప్రియమైన స్నేహితుడు అమీర్‌ఖాన్‌ను జపాన్ లోని విమానాశ్రయంలో కలిశాను. అప్పుడు జరిగిన ఒక మీటింగ్, చిన్న సంభాషణ ఎంతో మనోహరమైనది. నా ఇంట్లో లాల్ సింగ్ చద్దా ప్రత్యేక ప్రివ్యూ ఇచ్చినందుకు ఆమీర్ ఖాన్ కు ధన్యవాదాలు. అద్భుతమైన సినిమా తీశావు. లాల్ సింగ్ చద్దా తెలుగు వెర్షన్‌ను ప్రదర్శించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈసినిమాను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు’ అని పోస్ట్ చేశారు.

కాగా ఈసినిమాను వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు రూపొందిస్తున్నాయి. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నఈసినిమాలో మోనా సింగ్, యోగి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఆగష్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.