ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు తమ తమ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ మినహా మిగతా హీరోలు అందరూ హైదరాబాద్ లో పలు లోకేషన్స్ లో జరుగుతున్న షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న “గాడ్ ఫాదర్ “మూవీ శంకరపల్లి సెట్ లో జరుగుతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న “NBK107″మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాగ్ అశ్విన్ దర్శకత్వం లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న “ప్రాజెక్ట్ K “మూవీ షూటింగ్ ఖానాపూర్ లో జరుగుతుంది. క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “హరిహర విరమల్లు” సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7ఎకర్స్ లో జరుగుతుంది.శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ హీరోగా తెరకెక్కుతున్న “#RC15 “మూవీ షూటింగ్ గోల్కొండ దగ్గర జరుగుతుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా హీరోగా రూపొందుతున్న “రావణాసుర” సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది.శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , సమంత జంటగా తెరకెక్కుతున్న “ఖుషి” మూవీ షూటింగ్ కశ్మీర్ లో జరుగుతుంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: