వరస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు డైరెక్టర్ మారుతి. ప్రస్తుతం మారుతి తెరకెక్కిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా చేస్తున్న ఈసినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. జూన్ 26వ తేదీన ఈ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ఇక ఈకార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్టు మేకర్స్ తెలియచేశారు. చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ – బన్నీవాసు కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: