తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క విభిన్నమైన కథలను చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ఇక వాటి ఫలితాలను చూస్తూనే ఉన్నాం. ఇక సూర్య పుట్టిన రోజుకు ఒకరోజు ముందు సూర్య సినిమాకు ఇన్ని జాతీయ అవార్డులు రావడం గొప్ప విషయమనే చెప్పాలి. ఇక నేడు సూర్య తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఫ్యాన్స్, సినీ సెలబ్రెటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా సూర్యకు బర్త్‌డే విషెస్‌తో పాటు జాతీయ అవార్డు గెలుచుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాడు. 68వ జాతీయ అవార్డు గెలుచుకున్న మై డియర్ సూర్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ ప్రతిష్టాత్మక అవార్డును మీ పుట్టిన రోజు సందర్భంగా గెలుచుకోవడం మరింత ప్రత్యేకం. మీకు నా జన్మదిన శుభాకాంక్షలు. మున్ముందు కూడా ఇలాంటి మరెన్నో ప్రశంసలు మీరు అందుకోవాలని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
Hearty Congrats to my dearest @Suriya_offl on the National Best Actor Award!! It’s even more special coming on the eve of your birthday💐!! Many Many Happy Returns of the Day & Wishing you Many many more accolades along the way!!#68thNationalFilmAwards pic.twitter.com/B7pLPgDIyw
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 23, 2022
ఇక సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన ‘సూరరై పోట్రు’ సినిమా పలు కేటగిరీల్లో నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. జాతీయ ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డ్ ను సొంతం చేసుకుంది. సూర్యకు ఉత్తమ నటుడిగా.. అదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన అపర్ణ మురళి జాతీయ ఉత్తమ నటి అవార్డుని కైవసం చేసుకుంది. వీటితో పాటు ఉత్తమ సంగీత దర్శకుడు కేటగిరీలో జీవీ. ప్రకాష్ కుమార్), ఉత్తమ స్క్రీన్‌ప్లే కేటగిరీలో సుధా కొంగర, షాలిని ఉషాదేవి లకు అవార్డులు దక్కాయి.
ఇక ప్రస్తుతం సూర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. విభిన్న సినిమాల దర్శకుడు బాల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాతో పాటు ‘వాడివసల్’ సినిమా కూడా చేస్తున్నాడు. వెట్రిమారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈరెండు సినిమాలు కూడా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటున్నాయి.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























