అగ్రహీరోలతో సల్మాన్ పార్టీ..!

Salman Khan with Megastar Chiranjeevi and Victory Venkatesh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Salman Khan,Megastar Chiranjeevi,Victory Venkatesh,Salman Khan parties with Chiranjeevi,Salman Khan Multistarer Movie With Victory Venkatesh,Megastar Chiranjeevi and Venkatesh Daggubati,Chiranjeevi

మన టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ హీరోలకు మధ్య ఎప్పటినుండో ప్రత్యేకమైన అనుబంధం ఉందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇంకా పరిస్థితులు మారడంతో కలిసి సినిమాలు కూడా చేసే రోజులు వచ్చాయి. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సైతం చిరంజీవి సినిమాలో అది కూడా ఒక పాత్రలో నటిస్తున్నాడంటేనే చెప్పొచ్చు సినీ పరిశ్రమల్లో ఎంత మార్పు వచ్చిందో. ఇక సల్మాన్ తో చిరంజీవి, వెంక‌టేష్ కు ఉన్న అనుబంధం గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇక తాజాగా వీరు ముగ్గురు కలిసి ఒక పార్టీకి హాజరవ్వడం ఆ ఫొటోలు కాస్త బయటకు రావడంతో వైరల్ అవుతున్నాయి. స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం షూటింగ్ నిమిత్తం హైద‌రాబాద్‌లోనే ఉన్నాడు. ఈనేపథ్యంలోనే చిరు, వెంకీతో క‌లిసి ఓ ప్రైవేట్ పార్టీకి హాజ‌రైనట్టు తెలుస్తుంది. జేసీ పవ‌న్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీలో వెంకీ, చిరు, స‌ల్మాన్ పాల్గొన్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా చిరు నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో ఓ చిన్న పాత్రలో సల్మాన్ నటిస్తున్నాడు. మరోవైపు సల్మాన్ ఖాన్ హీరోగా ‘కభీ ఈద్ కభీ దివాలి’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో వెంకీ ఒక కీలక పాత్రలో నటించనున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ కోసం ఆచార్య’ సినిమాకు వేసిన ‘ధర్మస్థలి’ టెంపుల్ సెట్ నే వాడుకుంటున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 8 =