
ట్యాగ్ · 351 కథనాలు · పేజీ 7


'గాడ్ ఫాదర్' లో ఇప్పటివరకూ చేయని పాత్ర చేశా

గాడ్ ఫాదర్ లో నా అంచనా తప్పలేదు

అనంతపురంలో గాడ్ ఫాదర్ మెగా పబ్లిక్ ఈవెంట్

MEGA 154 మూవీ నుండి లేటెస్ట్ పిక్
సెన్సార్ పూర్తి చేసుకున్న గాడ్ ఫాదర్

ప్రేక్షకుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను - చిరంజీవి

మెగా 154 కీ షెడ్యూల్ ప్రారంభం

తమ్ముడికి అన్న బర్త్ డే విషెస్

చిన్న సినిమాకు మెగా సాయం

సీతారామం మూవీ పై చిరంజీవి ప్రశంసలు

మెగాస్టార్ బర్త్ డే గ్లింప్స్

లైగర్ టీమ్ కు చిరంజీవి బెస్ట్ విషెస్

సిటీకి దూరంగా ఫ్యామిలీతో చిరు

కోటి వ్యూస్ చేరువలో గాడ్ ఫాదర్ టీజర్

గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగిల్ తో రెడీ

గాడ్ ఫాదర్ టీజర్ కు మాసివ్ రెస్పాన్స్

భోళా శంకర్ మూవీ రిలీజ్ డేట్

అందుకే మెగాస్టార్ అయ్యారు
మెగాఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా గాడ్ ఫాదర్. రీసెంట్ గా రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇప్పుడు ఈసినిమా కోసం అలానే ఈసినిమా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ సినిమాపై వరుస అప్ డేట్లతో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. వరుసగా పలు పాటలు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఘనంగా జరపనున్నారు.

'గాడ్ ఫాదర్' లో ఇప్పటివరకూ చేయని పాత్ర చేశా
భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గాడ్ ఫాదర్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్గా నిర్మిస్తున్నారు. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో సత్యదేవ్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

గాడ్ ఫాదర్ లో నా అంచనా తప్పలేదు
గాడ్ ఫాదర్ లో నా అంచనా తప్పలేదు అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇంతకీ ఏ విషయం ఏంటీ అంటే.. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలను పెంచేసింది.

అనంతపురంలో గాడ్ ఫాదర్ మెగా పబ్లిక్ ఈవెంట్
భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గాడ్ ఫాదర్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ అక్టోబర్ 5 న గ్రాండ్ విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. టీజర్, ట్రైలర్ అన్నీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చూస్తున్నారు. ఇక ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ మెగా ఈవెంట్ తేదీ, వేదికను ప్రకటించారు.

MEGA 154 మూవీ నుండి లేటెస్ట్ పిక్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్ )మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.”వాల్తేరు వీరయ్య ”(వర్కింగ్ టైటిల్ ) మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.# MEGA 154 మూవీ తాజా…
సెన్సార్ పూర్తి చేసుకున్న గాడ్ ఫాదర్
చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఈసినిమా రీమేక్. ఈసినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో ఇప్పుడు చిత్రయూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. రీసెంట్ గా ఈమూవీ నుంచి విడుదలైన తార్ మార్ తక్కర్ మార్ సాంగ్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇక ఈసినిమా సెన్సార్…

ప్రేక్షకుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను - చిరంజీవి
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో 4 దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి టాలీవుడ్ లో మెగా స్టార్ గా కొనసాగుతున్నారు. చిరంజీవి టాలీవుడ్ కు పరిచయం అయిన ఫస్ట్ మూవీ ప్రాణం ఖరీదు 1978 సెప్టెంబర్ 22 వ తేదీ రిలీజ్ అయ్యింది. చిరంజీవి టాలీవుడ్ లో 44 సంవత్సరాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

మెగా 154 కీ షెడ్యూల్ ప్రారంభం
కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్రహీరోలు కూడా సినిమాలు చేసుకుంటూ వెళిపోతున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఇంకా స్పీడు మీదున్నాడు. రీసెంట్ గానే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ ఈ ఏడాదే మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. చిరు ప్రస్తుతం అయితే మెహన్ రాజా తో గాడ్ ఫాదర్ చేస్తున్నాడు. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అలానే మెహర్ రమేష్ తో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.

తమ్ముడికి అన్న బర్త్ డే విషెస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. సెప్టెంబర్ 2వ తేదీ పవన్ పుట్టినరోజు. ఈరోజు కోసం అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఆరోజు రానే వచ్చేసింది. పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఇక ఫ్యాన్స్ హడావుడి ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. మరోవైపు ఈ క్రమంలో అటు సినీ ప్రముఖులు, ఇటు రాజకీయ నాయకుల నుండి పవన్ కు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో తన తమ్ముడుకి అన్న చిరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు. తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ…

తమ్ముడు పవర్ స్టార్ బర్త్ డే కు మెగా స్టార్ అడ్వాన్స్ విషెస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే (సెప్టెంబర్ 2 )కు ఫ్యాన్స్ చేసే హంగామా తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే(సెప్టెంబర్ 2) సందర్భంగా సూపర్ హిట్ జల్సా , తమ్ముడు మూవీస్ స్పెషల్ షోస్ ను అభిమానులు ప్లాన్ చేశారు. బర్త్ డే కు ఒక రోజు ముందుగానే కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్‌లో సెప్టెంబర్ 1న 4K క్వాలిటీతో తమ్ముడు , జల్సా మూవీస్ స్పెషల్ షోస్ ను ఫ్యాన్స్ ప్లాన్ చేశారు.

చిన్న సినిమాకు మెగా సాయం
పూర్ణోదయ క్రియేషన్స్ బ్యానర్ పై శంకరాభరణం , సాగర సంగమం , స్వాతిముత్యం , స్వయంకృషి , సీతాకోక చిలక వంటి సూపర్ హిట్ మూవీస్ నిర్మించిన ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్ టైన్ మెంట్, మిత్ర వింద మూవీస్ బ్యానర్స్ పై వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్ రెడ్డి , సంచిత బసు జంటగా పవన్ కళ్యాణ్ సినిమా ఖుషి మొదటి రోజు మొదటి ఆట చూడాలి అనే కాన్సెప్టుతో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రిలీజ్ కానుంది.

సీతారామం మూవీ పై చిరంజీవి ప్రశంసలు
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.అందమైన ప్రేమకథ గా తెరకెక్కిన సీతారామం మూవీ ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లకు పైగా గ్రాస్…

మెగాస్టార్ బర్త్ డే గ్లింప్స్
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఆగష్ట్ 22న అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈరోజు కోసం ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న చిరు అభిమానులు చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. ఆయన బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసిన సందడి అంతఇంత కాదు. అభిమానులతో పాటు పలువురు ప్రముఖుల నుండి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ అందించారు. ఇక ఈ స్పెషల్ డేను చిరు తన కుటుంబ సభ్యులతో హ్యాపిగా గడిపారు. ఈ విషయాన్ని స్వయంగా చిరు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా తనకు విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇక నేడు తన పుట్టినరోజుకు సంబంధించిన గ్లింప్స్ ను సోషల్…

లైగర్ టీమ్ కు చిరంజీవి బెస్ట్ విషెస్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.లైగర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా మూవీ…

సిటీకి దూరంగా ఫ్యామిలీతో చిరు
మెగా అభిమానులకు ఆగష్ట్ వచ్చిందంటే చాలు పండగే. ఆగష్ట్ 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో నెల రోజుల ముందు నుండే ఫ్యాన్స్ సందడి మొదలుపెడుతుంటారు. ఏం కార్యక్రమాలు చేయాలి.. ఏం ఏర్పాట్లు చేయాలి అంటూ ముందు నుండీ ప్లానింగ్ లో ఉంటారు. ఇక అనుకున్నట్టే చిరు పుట్టినరోజు రావడం.. అయిపోవడం కూడా జరిగిపోయింది. ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు ఎప్పటిలాగే అభిమానులు కూడా అభిమానులు రక్తదానం చేయడం, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే తన కొత్త సినిమాల నుండి కూడా ఫ్యాన్స్ కు సర్ ప్రైజింగ్ ట్రీట్ లు వచ్చాయి.

కోటి వ్యూస్ చేరువలో గాడ్ ఫాదర్ టీజర్
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మెగాస్టార్” గాడ్ ఫాదర్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మెగా…

గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగిల్ తో రెడీ
టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంటే వెంటనే థమన్ అని చెప్పేయొచ్చు. ఈ రెండేళ్లలోనే థమన్ ఎంత బిజీ అయిపోయాడో చూస్తూనే ఉన్నాం. పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకూ థమనే మ్యూజిక్ ఇస్తున్నాడు. చిన్న సినిమాల నిర్మాతలు కనీసం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయినా థమన్ తో చేయించుకోవాలని అంటున్నారు. ప్రస్తుతం అయితే పలు సినిమాలో బిజీగా ఉన్నాడు థమన్. అందులో మెగాస్టార్ చిరు గాడ్ ఫాదర్ సినిమా కూడా ఒకటి ఉంది. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులతో బిజీగా ఉంది. మరోవైపు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చిరు…

గాడ్ ఫాదర్ టీజర్ కు మాసివ్ రెస్పాన్స్
మొత్తానికి మెగాఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టైమ్ వచ్చేసింది. నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సందర్భంగా చిరు బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కు టీజర్ తో ఒకరోజు ట్రీట్ ఇవ్వనున్నట్టు ప్రకటించిన చిత్రయూనిట్.. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 20 ఏళ్లు ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు, కానీ సడన్గా తిరిగి వచ్చిన ఆరేడేళ్లలోనే జనాల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు అంటూ మురళీ శర్మ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైంది టీజర్. ఇక్కడికి ఎవరు వచ్చినా పట్టించుకోను కానీ అతను మాత్రం రాకూడదు అంటూ నయనతార చెబుతున్న డైలాగ్…

భోళా శంకర్ మూవీ రిలీజ్ డేట్
ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహెర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. మురళీశర్మ , రావు రమేష్ , రఘుబాబు, వెన్నెల కిషోర్, రష్మీ , శ్రీముఖి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు.

చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఘరానా మొగుడు స్పెషల్ షోస్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. తమ అభిమాన హీరోల బర్త్ డే కు వారి పాత సూపర్ హిట్ మూవీస్ స్పెషల్ షోస్ థియేటర్స్ లో ప్రదర్శిస్తూ అభిమానులు తమ అభిమానం చాటుకుంటున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కు సూపర్ హిట్ పోకిరి మూవీ స్పెషల్ షోస్ భారీ వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ జల్సా మూవీ ని పవన్ కళ్యాణ్ బర్త్ డే కు స్పెషల్ షోస్ ను అభిమానులు ప్లాన్ చేశారు. తాజాగా చిరంజీవి బర్త్ డే (ఆగస్ట్ 22 ) కు హైదరాబాద్ లో బ్లాక్ బస్టర్ ఘరానా మొగుడు మూవీ స్పెషల్ షోస్ ను 21 , 22 తేదీలను అభిమానులు ప్లాన్ చేశారు.ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకుంటున్న ఘరానా మొగుడు…