ఈ ఏడాది రిలీజ్ అవుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఆచార్య కూడా ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది.. ఈసినిమాపై పెట్టు కున్న ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ అయిందా లేదా అన్న విషయాలు తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, సోనూ సూద్, సత్యదేవ్, తనికెళ్ల భరణి తదితరులు..
దర్శకత్వం.. కొరటాల శివ
నిర్మాతలు..నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్
బ్యానర్స్.. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్, కొణిదల ప్రొడక్షన్ కంపెనీ
సంగీతం.. మణిశర్మ
సినిమాటోగ్రాఫర్.. తిరు
ఎడిటర్.. నవీన్ నూలి
కథ..
ధర్మస్థలి ధర్మానికి మారు పేరైన ఒక ప్రాంతం. ధర్మస్థలిని ఆనుకుని ఉన్న పాదఘట్టం.. ఆయుర్వేదానికి ప్రసిద్ధి. తరతరాల నుంచి ఆ ప్రాంత ప్రజలు.. ధర్మస్థలిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.
అయితే అక్కడ బసవ (సోనూ సూద్) అనే పేరుతో అధర్మం రాజ్యమేలుతుంది. అటువంటి తరుణంలో అక్కడికి ఆచార్య (చిరంజీవి) వస్తాడు. అక్కడి ప్రజలకు అండగా నిలబడి వారి సమస్యలను చక్కబెడుతుంటాడు. అయితే అతనో నక్సల్.. అలాంటి ఆచార్య పాద ఘట్టం ప్రజలకు ఎందుకు అండగా నిలబడ్డాడు? పాద ఘట్టం లో పెరిగిన… ధర్మస్థలిలో ధర్మ స్థాపనకు కృషి చేసిన సిద్ధకు (రామ్ చరణ్), ఆచార్య మధ్య సంబంధం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ
మెగా ఫ్యామిలీ నుండి సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ ఏ రేంజ్ లో సందడి చేస్తారో తెలిసిందే. అలాంటిది చిరు-చరణ్ కలిసి తీసిన సినిమా వస్తుందంటే ఇంకే రేంజ్ లో సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్ కు పండగలాంటిదే. ఈ సినిమాకు కూడా అదే బలం. వీరి నటన గురించి చెప్పేదేముంది. చిరుది 44 ఏళ్ల సినీ ప్రయాణం.. చరణ్ కూడా విభిన్నమైన పాత్రలు కథలతో నటుడిగా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసినిమాలో కూడా ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయారు. ముఖ్యంగా చిరు, చరణ్ కనిపించే సన్నివేశాలు మాత్రం అభిమానులకు కన్నుల పండగ అని చెప్పాలి. నిజ జీవితంలోని వాళ్ళిద్దరి బంధం… తెరపై పాత్రలకు సహాయ పడింది. చిరు స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతం. సిద్ధ రోల్ లో రామ్ చరణ్ కూడా అద్భుతంగా నటించాడు.
పూజా హెగ్డే పాత్ర పరిధి తక్కువే అయినా కూాడా స్క్రీన్ మీద కనిపించినంతసేపు ఆకట్టుకున్నారు. పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆమె కూడా ఒదిగిపోయింది.ఇక సోను సూద్, జిష్షు సేన్ గుప్తా, తనికెళ్ళ భరణి, అజయ్ తదితరులు తమ పాత్రల మేర నటించారు. ఇక ప్రమోషన్స్ లో చెప్పినట్టే కాజల్ పాత్రను పూర్తిగా తొలగించారు.
కొరటాల శివ అంటేనే ఈసినిమా సగం సక్సెస్ అయిన ఫీలింగ్ వచ్చేసింది అందరికీ. ఎందుకంటే కొరటాల నుండి వచ్చిన గత సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో చూశాం. తన రైటింగ్ స్కిల్స్ కానీ, హీరోను తను ప్రెజెంట్ చేసే విధానం కానీ చాలా బాగుంటుంది. అలానే తన సినిమాలతో ఏదో ఒక మెసేజ్ ను కూడా ఇస్తుంటాడు. సోషల్ మెసేజ్‌తో కమర్షియల్ హిట్లు కొట్టడం కొరటాల శివకు వెన్నతో పెట్టిన విద్యఇక ఈసారి తనకు దొరికిన హీరోలు మెగాస్టార్, మెగా పవర్ స్టార్. మరి అలాంటి హీరోలు దొరికినప్పుడు కొరటాల శివ సైలెంట్ గా ఉండడు కదా. ఆచార్య లాంటి కథతో వచ్చేశాడు. నిజానికి కథలో కొత్తదనం లేకపోయినా కొరటాల శివ టేకింగ్ తో మ్యాజిక్ చేశాడు.
ధర్మస్థలిలో ఆచార్య అడుగుపెట్టడం.. బసవ ఆగడాలను అడ్డుకోవడం, పాటలు ఫైట్లు ఇలా ఫస్ట్ హాఫ్ కాస్త సాధారణంగా సాగిపోతుంది. అయితే సిద్ద పాత్ర పరిచయంతో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంట్రెస్టింగ్ మారుతుదంది. ఇక సెకండ్ హాఫ్‌లో రామ్ చరణ్ పాత్ర చుట్టూ తిరిగే కథనం, దానికి తగినట్టుగా తన యాక్టింగ్.. అన్నీ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి.
ఇక సాంకేతిక విభాగానికి వస్తే మణిశర్మ సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్ అయిందని చెప్పొచ్చు. ఇప్పటికే పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక తిరు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. అలానే ఆర్ట్ డైరెక్టర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈసినిమా కోసం వేసిన టెంపుల్ టౌన్ సెట్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్న విషయం అర్థమవుతుంది.
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఆచార్య ఒక ఎమోషనల్ సీరియస్ డ్రామా అని చెప్పొచ్చు. ఈసినిమాను మెగా అభిమానులు ఎలాగూ చూసేస్తారు. అయితే మిగిలిన సినీ ప్రేక్షకులు కూడా ఒక సారి చూసి ఎంజాయ్ చేయోచ్చు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: