సింగర్ కె.కె మృతి.. మెగా హీరోల సంతాపం..!

Megastar Chiranjeevi And Pawan Kalyan Mourn Singer KK Demise,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Megastar Chiranjeevi,Chiranjeevi and Pawan Kalyan Mourn Singer KK Demise,Power Star Pawan Kalyan Mourn For Singer KK Demise,Chiranjeevi and Pawan Kalyan Mourn For Singer Krishnakumar Kunnath Demise, Chiranjeevi and Pawan Kalyan Mourn,Krishnakumar Kunnath SUdden Demise,Krishnakumar Kunnath Concert at Kolkata,Krishnakumar Kunnath Last Concert at kolkata,Krishnakumar Kunnath Demise at Kolkata Concert

సినీ పరిశ్రమలు గత రెండేళ్ల నుండి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఇప్పటికే రెండేళ్లపాటు ఆర్థికంగాచాలా నష్టపోయింది. దానికితోడు ఎంతో మంది నటీనటులు మృతిచెందుతున్నారు. ఈ మధ్యకాలంలోనే బాల సుబ్రహ్మణ్యం, సిరివెన్నెల సీతారామశాస్త్రి, లతా మంగేష్కర్ లాంటి లెంజెండరీస్ ను కోల్పోగా.. పునీత్ రాజ్ కుమార్ లాంటి స్టార్ హీరో తోపాటు పలువురు అతి చిన్న వయసులోనే మరణించారు. ఇక ఇప్పుడు మరో విషాదఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్ కె.కె (కృష్ణ కుమార్ కునాథ్) కన్నుమూశారు. మంగళవారం కోల్‌కత్తాలో కె.కె లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్లగా అక్కడ ప్రోగ్రామ్ అయిన కొంతసేపటికి సడన్‌గా అనారోగ్యానికి గురవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. అయితే కె.కె వయసు 53 సంవత్సరాలే. చిన్న వయసులోనే మరణించడంతో ఫ్యాన్స్, ఇండస్ట్రీ అంతా విచారం వ్యక్తం చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా కె.కె ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను పాడారు. ‘ప్రేమ దేశం’ సినిమాలో ‘హలో డాక్టర్ హార్ట్ మిస్సాయో’, ఘర్షణలో చెలియా చెలియా పాటతో పాటు ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్‌’ గుర్తుకొస్తున్నాయి అంటూ ఆయన ఆలపించిన గీతాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఖుషి సినిమాలో ఏ మేరా జహా, బాలు సినిమాలో ఇంతే ఇంతింతే, గుడుంబా శంకర్ సినిమాలో లె లె లేలే వంటి సాంగ్స్ పాడారు. ఇంకా మనసంతా నువ్వే, ఆర్య 2 లాంటి చాలా బ్లాక్ బస్టర్ సినిమాలలో పాటలు పాడారు. వీటితో పాటు ఇంకా పలు సినిమాల్లో పలు హిట్ సాంగ్స్ పాడారు.

ఇదిలా ఉండగా కె.కె మృతి పట్ల సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి, అలానే పవన్ కళ్యాణ్ సంతాపం తెలియచేశారు. ఈసందర్భంగా చిరు తన ట్విట్టర్ ద్వారా కె.కె మరణం చాలా దిగ్భ్రాంతికి గురిచేసింది.. గ్రేట్ సింగర్.. గ్రేట్ సోల్, ఇంద్ర సినిమాలో దాయి దాయి దామ్మ అనే పాటను పాడారు.. అతనికి, అతని కుటుంబసభ్యులకు నా సంతాపం తెలియచేస్తున్నా అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా కె.కె మరణంపై స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. కె.కె గారి అకాల మరణం బాధ కలిగించింది. సినీ సంగీత చరిత్రలో తనకంటూ ప్రత్యేక బాణిని కలిగిన గాయకుడు కె.కె. నాకు ఎన్నో మంచి పాటలు అందించారు. సంగీత కచేరి ముంగించుకున్న కొద్దిసేపటికే హఠాన్మరణం చెందడం దిగ్బ్రాంతికరం. ఆయన చివరి శ్వాస వరకూ పాడుతూనే ఉన్నారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అంటూ సంతాపం తెలిపారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.