‘ఆచార్య’ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

Acharya Movie Interesting Elements,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Acharya,Acharya Telugu Movie,Acharya Movie Updates,Acharya Telugu Movie Updates,Acharya Mutlistarrer Movie Updates,Chiranjeevi Starrer Movie Acharya, Chiranjeevi and Ram Charan Multi Starrer movie Acharya,Acharya Interestin Elements,Interesting Elements in Acharya Movie,Koratala Siva's Movie Acharya, Director Koratala Siva Movie Acharya,Acharya Telugu Movie Review,Acharya Movie Review,Acharya Review,Acharya Movie Review and Rating,Acharya Movie Pre Review, Acharya First Review,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya (2022 film),Acharya (2022),Acharya Movie (2022),Acharya Film,Acharya FDFS Review, Acharya Pre Review,Acharya Premiere Show Review,Acharya Movie Plus Points,Acharya Movie Highlights,Acharya Movie Updates,Acharya Pre Public Talk, Acharya Movie Live Updates,Acharya Movie Stroy,Acharya Movie Public Talk,Acharya Movie Public Response,Acharya Movie Public Talk And Public Response, Chiranjeevi And Ram Charan Multistarrer Movie,Acharya Movie Latest News,Megastar Chiranjeevi,Chiranjeevi,Ram Charan,Chiranjeevi Acharya,Koratala Siva, Kajal Aggarwal,Pooja Hegde,Acharya Movie Rating

ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ లో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ తో పాటు ప్రతి సినీ లవర్ ఎంత ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య కాలంలో అలాంటి ఎగ్టైజ్ మెంట్ ను తీసుకొచ్చిన సినిమాల్లో పవన్-రానా కాంబినేషన్ లో వచ్చిన భీమ్లానాయక్ అలానే ఎంతో కాలంగా ఎదురుచూసిన ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా. ఈరెండు సినిమాలు రిలీజ్ అయిపోయాయి బ్లాక్ బస్టర్లు కూాడా కొట్టాయి. ఇప్పుడు అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తుంది ఆచార్య సినిమా కోసం. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవడంతో సినిమాకోసం అటు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* ఇక ఈసినిమా పై ఇంత ఇంట్రెస్ట్ రావడానికి ప్రధాన కారణం చిరు-చరణ్ కాంబినేషన్. సాధారణంగా మెగా ఫ్యామిలీ నుండి సినిమా వస్తుందంటే మెగా ఫ్యాన్స్ హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. మరి అలాంటిది ఒక మెగాస్టార్-మెగా పవర్ స్టార్ ఇద్దరూ కలిసి నటించిన సినిమా అంటే ఆ ఇంట్రెస్ట్ ఇంకే రేంజ్ లో ఉంటుంది చెప్పనక్కర్లేదు. వీరిద్దరిని ఎప్పటినుండో ఒకే స్క్రీన్ పై చూడాలన్న కోరిక ఈసినిమాతో తీరబోతుంది. గతంలో ఏదో ఒక పాటలో, అతిథి పాత్రల్లో కలిసి కనిపించారు చిరు-చరణ్ అంతేతప్పా ఇలా ఒక సినిమాలో కలిసి నటించింది లేదు.

* మరోవైపు ఈసినిమాకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో వహించడం మరో ప్లస్ పాయింట్. మిర్చి సినిమాతో డైరెక్టర్ గా ప్రస్థానం మొదలుపెట్టిన కొరటాల ఆ తరువాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలను తీశాడు. అన్ని సినిమాలు సూపర్ హిట్లనే అందించాయి. అలాంటి సక్సెస్ రేటు ఉన్న డైరెక్టర్ నుండి ఈసినిమా వస్తుండటంతో సినిమాపై మొదటినుండి భారీ అంచనాలు ఉన్నాయి. తన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో అలానే సమాజానికి ఉపయోగపడే మెసేజ్ ను సైతం సినిమా ద్వారా తెలియచేస్తాడు. ఈసినిమా కథ కూడా నక్సల్ నేపథ్యం, ఆలయాల నేపథ్యంలో వస్తుంది

* అంతేకాకుండా ఈసినిమాలో యాడ్ అయిన మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ సూపర్ స్టార్ వాయిస్ ఓవర్ అందించడం. మెగా ఫ్యాన్స్ కు మాత్రమే కాదు అటు మహేష్ ఫ్యాన్స్ కు కూడా సర్ ప్రైజింగ్ ఎలిమెంటే. గతంలో మహేష్ పవన్ జల్సా సినిమాకు వాయిస్ ఓవర్ అందించాడు. ఇప్పుడు అన్న చిరు సినిమాకు వాయిస్ ఓవర్ అందిస్తుండటంతో ఆసక్తి మరింత పెరిగింది.

* వీటన్నింటికీ తోడు టెక్నికల్ వాల్యూస్ కూడా ఈసినిమా ప్రధాన బలం అవ్వనున్నాయి. ఈ సినిమా కోసం వేసిన ధర్మస్థలి సెట్.. ముఖ్యంగా ఈసినిమా కోసం వేసిన టెంపుల్ సెట్ అయితే సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తుంది. ఇంకా మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పేదేముంది. చిరు సినిమా నిర్మాణ విలువల ఎంత రిచ్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పాటలు , టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై ఆసక్తికని పెంచేశాయి. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో.. బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + one =