ట్యాగ్ · 351 కథనాలు · పేజీ 17
అందుకే యంగ్ డైరెక్టర్స్ తో చేస్తున్నా..!
చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ చిత్రం
‘ఆచార్య’.. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్

ఆమె మా అమ్మ కాదు.. క్లారిటీ ఇచ్చిన చిరు..!
గురుశిష్యులుగా చిరు, చరణ్
పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్ చేస్తున్నా..!
పూర్వ స్థితికి చేరుకుంటాం - చిరంజీవి
త్రిష తప్పుకోవడానికి కారణం అదే..!
అల్లు అర్జున్ కు చిరంజీవి బర్త్ డే శుభాకాంక్షలు
ప్రధాని పిలుపుకు చిరంజీవి సంఘీభావం

‘ఆచార్య’ ఆగమనం అప్పుడేనా?

టామ్ అండ్ జెర్రీ లా చిరు-మోహన్ బాబుల ట్వీట్స్

చిరు ట్వీట్.. వెల్ కమ్ చెప్పిన ఎన్టీఆర్
భయం.. నిర్లక్యం రెండూ వద్దు
కామెడీ ఎంటర్ టైనర్ గా చిరు-త్రివిక్రమ్ సినిమా..!

హిలేరియస్ ఎంటర్ టైనర్ గా `మెగాస్టార్ 153`?
'చిరు' ఎఫెక్ట్ - టైటిల్ ను మార్చనున్నారా..!
చిరంజీవి వెబ్ సిరీస్ ఎంట్రీ
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "ఆచార్య" మూవీ తరువాత యువ దర్శకుల చిత్రాలలో నటించనున్నట్టు చిరంజీవి తెలిపారు. దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న చిరంజీవి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తాను ఒక వెబ్ సిరీస్ లో నటించనున్నట్టు ప్రకటించారు.
అందుకే యంగ్ డైరెక్టర్స్ తో చేస్తున్నా..!
సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస విజయాలతో తన సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెం 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఆ సినిమా తర్వాత ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి సినిమా చేశాడు.. ఇప్పుడు కొరటాలతో ఆచార్య సినిమా చేస్తున్నాడు. అంతే కాదు పలు ప్రాజెక్టులను కూడా లైన్ లో పెడుతున్నాడు మెగా స్టార్. అయితే ఈసారి మాత్రం యంగ్ డైరెక్టర్స్ తో చేయడానికే రెడీ అయ్యాడు చిరు. అంతేకాదు ఇదే విషయంపై కూడా స్పందించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తెలిపారు.
చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ చిత్రం
తెలుగునాట స్టైలిష్ ఫిల్మ్ మేకర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు మెహర్ రమేష్. అయితే, తెలుగు చిత్రాల కంటే ముందే కన్నడనాట రెండు విజయవంతమైన చిత్రాలు రూపొందించిన వైనం మెహర్ సొంతం. ‘వీర కన్నడిగ’(‘ఆంధ్రావాలా’కు రీమేక్) ‘అజయ్’(‘ఒక్కడు’ రీమేక్).. ఇలా మెహర్ తెరకెక్కించిన రెండు కన్నడ చిత్రాలు విజయపథంలో పయనించాయి. అనంతరం టాలీవుడ్‌పై దృష్టి సారించిన మెహర్.. తెలుగులో ‘కంత్రి’(2008), ‘బిల్లా’(2009), ‘శక్తి’(2011), ‘షాడో’(2013) వంటి చిత్రాలను తీర్చిదిద్దాడు. వీటిలో ‘బిల్లా’ చిత్రం మెరుగైన ఫలితాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే.. ఏడేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం తెలుగులో మరో భారీ…
‘ఆచార్య’.. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నాడు. దాదాపు 30 నిమిషాల నిడివి గల ఈ పాత్ర సినిమాకే ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని సమాచారం. కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి దాదాపు 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. అయితే, కరోనా ఎఫెక్ట్‌తో షూటింగ్‌కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆచార్య’ స్టోరీ లైన్‌ను రివీల్ చేశారు చిరు.
మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టిన మెగాస్టార్..!
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'ఆచార్య'. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. కమర్షియల్ ఎలిమేట్స్ తో సామజిక అంశాలను మేళవించి చూపించడంలో కొరటాల దిట్ట కాబట్టి ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ఆమె మా అమ్మ కాదు.. క్లారిటీ ఇచ్చిన చిరు..!
కరోనా వ్యాధిని అడ్డుకునే నేపథ్యంలో అందరూ సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇక దీనిలో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి కూడా తన స్నేహితురాళ్లతో కలిసి, మూడు రోజుల పాటు శ్రమించిన 700 మాస్క్ లను తయారు చేసి, వాటిని అవసరమైన వారికి అందించారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై మెగాస్టార్ చిరు స్పందించి ఆమె తన తల్లి కాదని క్లారిటీ ఇచ్చారు.
గురుశిష్యులుగా చిరు, చరణ్
రియల్ లైఫ్ తండ్రీకొడుకులు.. రీల్ లైఫ్‌లో అన్నదమ్ములుగానో లేదా తండ్రీకొడుకులుగానో కనిపించడం షరా మామూలే. అయితే గురుశిష్యుల పాత్రల్లో దర్శనం ఇవ్వడం మాత్రం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన అంశానికి వేదికగా నిలవనుంది మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’.
పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్ చేస్తున్నా..!
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు అహర్నిశలు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక దానిలో భాగంగానే...ప్రజలు బయటికి రాకుండా చేయడానికి పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడి రోడ్లపై డ్యూటీ చేస్తున్నారు. ఇక కుటుంబాలకు దూరంగా ఉంటూ.. ఇంత కష్టపడుతున్న పోలీసులకు సినీనటులతో పాటు పలువురు ప్రముఖులు కృతజ్ఞతలు చెబుతున్నారు. మహేష్ బాబు నిన్న తన ట్విట్టర్ ద్వారా ప్రశంసించగా నేడు మెగా స్టార్ చిరు కూడా వారిని కొనియాడారు.
పూర్వ స్థితికి చేరుకుంటాం - చిరంజీవి
కరోనా మహమ్మారి కారణంగా పలు పరిశ్రమలు మూతపడిన విషయం తెలిసిందే. షూటింగ్స్ బంద్ కావడం , థియేటర్స్ మూతపడటం, కొత్త సినిమాలు రిలీజ్ కాకపోవడంతో చిత్ర పరిశ్రమ కూడా సంక్షోభం లో చిక్కుకుంది. మెగా స్టార్ చిరంజీవి కరోనా వైరస్ గురించి, చిత్ర పరిశ్రమ నష్టాల గురించితన అప్ కమింగ్ మూవీ "ఆచార్య" గురించి పలు ఆసక్తి కర విషయాలు వెల్లడించారు. మూవీ షూటింగ్ క్యాన్సిల్ చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి మాట్లాడుతూ .. కరోనా వైరస్ గురించి, చాల వేగంగా ఇతర దేశాలలో వ్యాపించడం గురించి చదివిన చిరంజీవి దర్శకుడు శివ తో చర్చించి "ఆచార్య" మూవీ షూటింగ్ ను క్యాన్సిల్ చేశారు. ఆరోజే మల్టీ ప్లెక్స్ లు, థియేటర్స్ మూసివేయాలని ప్రభుత్వం…
త్రిష తప్పుకోవడానికి కారణం అదే..!
మొత్తానికి చిరు ఈమధ్య ఒకదాని తర్వాత ఒకటి నిజాలు మొత్తం బయటకు చెప్పేస్తున్నారు. పిట్టకథ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా టైటిల్ ను చెప్పి నోరు జారారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఉంటాడా..?చరణ్ ఉంటాడా? అన్న విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు. ఈ విషయంపై చిరుని అడుగగా... అసలు మహేష్ పేరు ఎలా వచ్చిందో తెలియట్లేదు...మొదటి నుండి ఈ సినిమాలో ఓ పాత్రకు చరణ్ అయితే బావుంటదని కొరటాల శివకు మొదటినుండి ఉంది.. అయితే చరణ్ 'ఆర్ఆర్ఆర్' తో బిజీ గా వున్నాడు... మొదటి నుండి అనుమానం ఉంది...రాజమౌళి, కొరటాల ఒక అండర్ స్టాండింగ్ కు వస్తే... ఈ సినిమాలో చరణ్ ఉండొచ్చు... లేకపోతే కుదరకపోవచ్చు అని చెప్పి క్లారిటీ ఇచ్చాడు.

ఏప్రిల్ 9 కేరాఫ్ మెగాస్టార్ మెమరబుల్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్
మెగాస్టార్ చిరంజీవికి బాగా కలిసొచ్చిన తేదీల్లో ఏప్రిల్ 9 ఒకటి. గతంలో ఇదే రోజున వేర్వేరు సంవత్సరాల్లో చిరు నటించిన రెండు చిత్రాలు విడుదల కాగా.. ఆ రెండు సినిమాలు కూడా ఘన విజయం సాధించడమే కాకుండా నటుడిగా తనకి మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి. ఆ చిత్రాలే.. `ఘరానా మొగుడు’, `బావగారూ...బాగున్నారా!`.
అల్లు అర్జున్ కు చిరంజీవి బర్త్ డే శుభాకాంక్షలు
దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు తన బర్త్ డే జరుపుకుంటున్నారు. ఫ్యాన్స్ కు తన బర్త్ డే కానుకగా తాను నటించే మూవీ టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. "పుష్ప" మూవీ లో అల్లు అర్జున్ మాస్ లుక్ అభిమానులతో పాటుప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది.
ప్రధాని పిలుపుకు చిరంజీవి సంఘీభావం
కరోనా మహమ్మారి తో ప్రపంచం తల్లడిల్లుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కాస్త తక్కువనే చెప్పవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి తీసుకున్న నిర్ణయాలే దానికి కారణం. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకై 130 కోట్ల భారతీయులు తమ సమైక్యతా భావాన్ని తెలిపేలా ఆదివారం రాత్రి 9గంటలనుండి 9 నిమిషాలవరకు దీప ప్రజ్వలన చేయాలనే ప్రధాని మోదీ పిలుపుకు సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా దీపాలు వెలిగించి సమైక్యతా భావాన్ని చాటారు.

‘ఆచార్య’ ఆగమనం అప్పుడేనా?
‘సైరా నరసింహారెడ్డి’ వంటి పేట్రియాటిక్ డ్రామా తరువాత మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్‌లో చిరుకి జోడిగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషించనున్నాడని టాక్. కాగా రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని... తొలుత ఆగస్టులో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే, ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడినట్టు టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

టామ్ అండ్ జెర్రీ లా చిరు-మోహన్ బాబుల ట్వీట్స్
మొత్తానికి మెగా స్టార్ చిరంజీవి అలా ట్విట్టర్ లోకి అడుగుపెట్టారో లేదో కానీ ఇప్పటి వరకూ ఎప్పుడూ లేనంత హడావుడి నడుస్తుంది. మన హీరోల్లా ఏదో వాడాంలే.. ఒక ట్వీట్ చేశాం మన పని అయిపోయింది అన్నట్టు కాకుండా... రోజుకు రెండు మూడు ట్వీట్స్ తో ఫుల్ యాక్టీవ్ లో వుంటున్నారు. దీనికి తోడు కరోనా వల్ల ఇంట్లోనే ఉండటంతో ట్విట్టర్ వేదికగా కామెడీ ట్వీట్స్ తో చిరు కామెడీ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తన స్నేహితుడు మోహన్ బాబు తో కూడా చమత్కరించారు. సోషల్ మీడియా లోకి అడుగుపెట్టినందుకు గానూ అందరు చిరుకి ప్రేమతో ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కూడా వెల్ కమ్ చెప్పాడు. దానికి చిరు థ్యాంక్స్ మిత్రమా.. 'రాననుకున్నావా…

చిరు ట్వీట్.. వెల్ కమ్ చెప్పిన ఎన్టీఆర్
అందరూ ఎంతగానే ఎదురు చూసిన ఎదురు చూపులకు.. ఎన్నో రూమర్లకు బ్రేక్ వేశాడు రాజమౌళి. ఫైనల్లీ ఉగాది రోజున టైటిల్ ను రిలీజ్ చేశారు. 'ఆర్ఆర్ఆర్' అంటే రామ రావణ రాజ్యం అంటూ పలు టైటిల్సే ప్రచారంలోకి వచ్చాయి. కానీ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఇదే టైటిల్ ఎక్కువ ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకు కొత్త టైటిల్ ను ఫిక్స్ చేశాడు. ని ఉగాది పండగ సందర్భంగా చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ టైటిల్‌ను, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ మోషన్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
భయం.. నిర్లక్యం రెండూ వద్దు
కరోనా వరుస భయం యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే విదేశాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండగా...మనదేశంలో నివారణ చర్యలు ముమ్మరం చేశారు. దీనిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగానే పలువురు సెలబ్రిటీలు తమ వంతుగా ఈ వైరస్ అంటకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పలు వీడియోల ద్వారా చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా వీడియో ద్వారా ప్రజలకు ధైర్యాన్ని.. సలహాలను పంచుకున్నారు.
కామెడీ ఎంటర్ టైనర్ గా చిరు-త్రివిక్రమ్ సినిమా..!
ఈ సారి మాత్రం ఫుల్ పక్కా కామెడీ ఎంటర్టైనర్ తో రావడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది మెగా స్టార్ చిరంజీవి. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత కామెడీ జోనర్ ను ట్రై చేయలేదు చిరు. మొదటి సినిమా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కాగా రెండో సినిమా సైరా ఫ్రీడమ్ ఫైటర్ సినిమా... ఇప్పుడు కొరటాల తో చేస్తున్న సినిమాలో కూడా కామెడీ లేనట్టుగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ ఎంటర్టైనర్ ను తీయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.

హిలేరియస్ ఎంటర్ టైనర్ గా `మెగాస్టార్ 153`?
`ఖైదీ నంబర్ 150`తో గ్రాండ్ గా రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆపై పేట్రియాటిక్ డ్రామా`సైరా నరసింహారెడ్డి`లో నటించారు. ఈ రెండింటిలోనూ సీరియస్ రోల్స్ లోనే కనిపించారు చిరు. అంతేకాదు.. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సోషల్ డ్రామా `ఆచార్య`లోనూ అదే శైలి పాత్రని పోషిస్తున్నారాయన.
'చిరు' ఎఫెక్ట్ - టైటిల్ ను మార్చనున్నారా..!
మొత్తానికి చిరు ఎఫెక్ట్ వల్ల సినిమా టైటిల్ ను మార్చే ప్లాన్ లో వున్నాడట కొరటాల శివ. నిజానికి వీరిద్దరి కాంబినేషన లో సినిమా స్టార్ట్ అయినప్పుడే ఆచార్య టైటిల్ తెగ ప్రచారం అయింది. అయితే ఈ టైటిల్ అవునో?కాదో..? అసలు ఆ టైటిల్ పెడతారో..? కొత్త టైటిల్ ఏదైనా ఫిక్స్ చేస్తారా..? ఇలా పలు ఆలోచనలతో కన్ఫ్యూజన్ లో వున్నారు అభిమానులు. అయితే 'ఓ పిట్టకథ' ప్రీరిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి నోరు జారి `ఆచార్య`అనే పేరు చెప్పేయడంతో సస్పెన్స్ కాస్త తుస్ మన్నది. పెద్దగా ప్లాన్ చేసి గ్రాండ్ గా టైటిల్ ను రిలీజ్ చేద్దామనుకున్నారు కొరటాల.. కానీ చిరు పొరపాటున నోరు జారారు. ఈ సినిమా టైటిలేంటో జనాలకు తెలిసిపోయింది. దాంతో ఈ…