అందరూ ఎంతగానే ఎదురు చూసిన ఎదురు చూపులకు.. ఎన్నో రూమర్లకు బ్రేక్ వేశాడు రాజమౌళి. ఫైనల్లీ ఉగాది రోజున టైటిల్ ను రిలీజ్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ అంటే రామ రావణ రాజ్యం అంటూ పలు టైటిల్సే ప్రచారంలోకి వచ్చాయి. కానీ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఇదే టైటిల్ ఎక్కువ ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకు కొత్త టైటిల్ ను ఫిక్స్ చేశాడు. ని ఉగాది పండగ సందర్భంగా చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఈ టైటిల్ను, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఇక ఈ మోషన్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Just saw the motion poster of @RRRMovie
Total eye feast & goosebumps.Electrifying score by @mmkeervaani Splendid job by 1 & only @ssrajamouli @Tarak9999 & #RamCharan are absolutely fantastic! Gives immense energy on this #Ugadi day!@ajaydevgn @aliaa08 https://t.co/UVNFjiXmh5— Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2020
ఇదిలా ఉండగా ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ పై ప్రసంశలు కురిపించారు మెగా స్టార్ చిరంజీవి. ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ అండ్ టైటిల్ అద్భుతం అని కొనియాడారు. ఐ ఫీస్ట్ అని.. రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయని కొనియాడారు. ఇక ఈ ప్రశంస పై ఎన్టీఆర్ స్పందించారు. ఆయన స్పందనకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్, సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చినందుకు వెల్ కమ్ చెప్పాడు.
ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: