
ట్యాగ్ · 351 కథనాలు · పేజీ 18



#NTR 30 మూవీ పై రూమర్ ను ఖండించిన నిర్మాతలు

చిరు 'లూసిఫర్' బాధ్యత వినాయక్ కు..!
`మెగాస్టార్ 152`... టైటిల్ ప్రకటించిన చిరు

జూన్ నుంచి `మెగాస్టార్ 152` షూటింగ్ లో చరణ్?

ఈ నెల 24 నుంచి `మెగాస్టార్ 152` నెక్స్ట్ షెడ్యూల్
చిరు బాటలోనే వెళుతున్న పవన్

ఆచార్య గా చిరు.. సిద్ధుగా చరణ్?

మెగాస్టార్ చిరంజీవి `కొండవీటి దొంగ`కి 30 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా.. బాక్సాఫీస్ వద్ద ఈ ముగ్గురిది కూడా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే చెప్పాలి. `అభిలాష`(1983)తో మొదలైన ఈ త్రయం సందడి... `కొండవీటి దొంగ` (1990) వరకు విజయవంతంగా సాగింది. అలాంటి ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం `కొండవీటి దొంగ`.

తెలుగు సంవత్సరాదికి `ఆచార్య` ఫస్ట్ ఇంప్రెషన్
23 ఏళ్ళ క్రితం `మాస్టర్`గా మురిపించిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు `ఆచార్య`గా అలరించేందుకు సిద్దమవుతున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో.. చిరు ఇదివరకు ఎన్నడూ పోషించని పాత్రలో దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ మెరుపు వేగంతో జరుగుతోంది. ఇటీవల పోలవరం పరిసర ప్రాంతాల్లో కొన్ని పోరాట ఘట్టాలను చిత్రీకరించిన యూనిట్.. త్వరలోనే తదుపరి షెడ్యూల్ ప్రారంభించనుంది.

మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్రల్లో నటించిన `కొత్త పేట రౌడీ`, `చండీ ప్రియ`కి 40 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ ఆరంభంలో పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. వాటిలో `కొత్త పేట రౌడీ`, `చండీ ప్రియ` ప్రత్యేకం. ఎందుకంటే... అప్పటి ఇద్దరు స్టార్ హీరోలు నటించిన ఈ రెండు సినిమాలూ ఒకే రోజున జనం ముందు నిలిచాయి. `కొత్త పేట రౌడీ`లో సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా నటించగా.. నటభూషణ్ శోభన్ బాబు హీరోగా `చండీప్రియ` రూపొందింది.

#NTR 30 మూవీ పై రూమర్ ను ఖండించిన నిర్మాతలు
హారిక &హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా #NTR 30 మూవీ రూపొందనుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ మూవీ మే నెలలో పూజ కార్యక్రమం జరుపుకుని , రెగ్యులర్ షూటింగ్ జూన్, జూలై నెలలలో జరుపుకోనుందని సమాచారం. ఎన్టీఆర్ ప్రస్తుతం మల్టీ స్టారర్ "RRR" మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

"ఆచార్య" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ?
కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ""ఆచార్య" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. త్రిష కథానాయిక కాగా సోనూ సూద్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

చిరు 'లూసిఫర్' బాధ్యత వినాయక్ కు..!
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో గత ఏడాది మార్చిలో వచ్చిన 'లూసిఫర్' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రైట్స్ రామ్ చరణ్ సొంతం చేసుకొని.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిరు ప్రధాన పాత్రలో చరణ్ ఈ సినిమాను నిర్మించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే హక్కులు సొంతం చేసుకున్నాడు కానీ అప్పటినుండీ.. ఈ సినిమా డైరెక్టర్, హీరో విషయంలో మాత్రం చరణ్ ఓ నిర్ణయానికి రాలేకపోయాడు. ఇక ఇన్ని రోజులు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు.
`మెగాస్టార్ 152`... టైటిల్ ప్రకటించిన చిరు
మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సోషల్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.

జూన్ నుంచి `మెగాస్టార్ 152` షూటింగ్ లో చరణ్?
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారీ బడ్జెట్ మూవీ `ఆర్ ఆర్ ఆర్` కోసం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సదరు సినిమా చిత్రీకరణలో భాగంగా... అడవి బాట పట్టాడు. కట్ చేస్తే.. మరోమారు మరో పాత్ర కోసం అడవుల వెంట సాగనున్నాడట ఈ కొణిదెల స్టార్.

ఈ నెల 24 నుంచి `మెగాస్టార్ 152` నెక్స్ట్ షెడ్యూల్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలను అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తయ్యింది. ఒక పాట, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
చిరు బాటలోనే వెళుతున్న పవన్
మెగాస్టార్ చిరంజీవి బాటలోనే అతని తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. చిరులాగే అనతికాలంలోనే స్టార్ డమ్ పొందారు. అంతేకాదు.. అన్నయ్య బాటలోనే సాగి రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. యాదృచ్ఛికంగా జరిగినా అచ్చంగా అన్నయ్య తరహాలోనే రీ-ఎంట్రీ బాట పట్టడమే కాకుండా, చిరు తరహాలో రీ-ఎంట్రీకి మూవీకి రీమేక్ ని ఎంచుకున్నారు పవన్.

ఆచార్య గా చిరు.. సిద్ధుగా చరణ్?
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే `మగధీర`, `బ్రూస్ లీ`, `ఖైదీ నంబర్ 150` చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. చరణ్ హీరోగా నటించిన `మగధీర`, `బ్రూస్ లీ` చిత్రాల్లో తన స్టన్నింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో చిరు మెస్మరైజ్ చేస్తే.. చిరు కథానాయకుడిగా నటించిన `ఖైదీ నంబర్ 150`లో చరణ్ ఓ పాట (అమ్మడు లెట్స్ డు కుమ్ముడు)లో మెరిశాడు. కట్ చేస్తే.. ఈ ఇద్దరూ మరోసారి స్క్రీన్ షేర్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారని టాక్.