‘చిరు’ ఎఫెక్ట్ – టైటిల్ ను మార్చనున్నారా..!

Chiranjeevi - Koratala Siva Movie To Get A New Title Name,Acharya, Acharya Movie, Acharya Movie Title Changed, Acharya Movie Updates, Acharya Telugu Movie, Acharya Telugu Movie Latest News, Acharya Telugu Movie Title Changed, latest telugu movies news, Megastar Chiranjeevi, Megastar Chiranjeevi’s Acharya To Get A New Title?, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

మొత్తానికి చిరు ఎఫెక్ట్ వల్ల సినిమా టైటిల్ ను మార్చే ప్లాన్ లో వున్నాడట కొరటాల శివ. నిజానికి వీరిద్దరి కాంబినేషన లో సినిమా స్టార్ట్ అయినప్పుడే ఆచార్య టైటిల్ తెగ ప్రచారం అయింది. అయితే ఈ టైటిల్ అవునో?కాదో..? అసలు ఆ టైటిల్ పెడతారో..? కొత్త టైటిల్ ఏదైనా ఫిక్స్ చేస్తారా..? ఇలా పలు ఆలోచనలతో కన్ఫ్యూజన్ లో వున్నారు అభిమానులు. అయితే ‘ఓ పిట్టకథ’ ప్రీరిలీజ్ ఫంక్ష‌న్లో చిరంజీవి నోరు జారి `ఆచార్య‌`అనే పేరు చెప్పేయడంతో సస్పెన్స్ కాస్త తుస్ మన్నది. పెద్దగా ప్లాన్ చేసి గ్రాండ్ గా టైటిల్ ను రిలీజ్ చేద్దామనుకున్నారు కొరటాల.. కానీ చిరు పొరపాటున నోరు జారారు. ఈ సినిమా టైటిలేంటో జ‌నాల‌కు తెలిసిపోయింది. దాంతో ఈ సినిమా టైటిల్ ను మార్చే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకో న్యూస్ కూడా వినిపిస్తుంది అదేంటంటే… ఈ సినిమాలో మహేష్ కానీ, రామ్ చరణ్ కానీ నటించే అవకాశం ఉండటంతో మల్టీ స్టారర్ కాబట్టి ఆ తరహాలో టైటిల్ ను పెట్టాలని చూస్తున్నారట. మరి ఈ సారి ఏ టైటిల్ ను ఫిక్స్ చేస్తారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఈ సినిమాకు కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను ‘ఉగాదికి’ విడుద‌ల చేయ‌డానికి యూనిట్ ప్లాన్ చేసిందట‌. టైటిల్ లోగోతో పాటు చిరు లుక్ ని కూడా ఉగాది రోజున విడుదల చేయాలనుకుంటున్నారట.

కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఈ మూవీ షూటింగ్‌లో త్రిష కూడా పాల్గొనబోతోంది. ఇటీవ‌ల పోల‌వ‌రం ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా .. త్వ‌ర‌లోనే త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభించ‌నుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − seven =