హీరో రవితేజ కు జోడీగా మీనాక్షి చౌదరి ?

Actress Meenakshi Chaudhary To Pair Up With Mass Maharaja Ravi Teja In His Upcoming Movie Directed By Ramesh Varma

మాస్ మహారాజా రవి తేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని , రవితేజ హిట్ కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ “క్రాక్ ” మూవీ షూటింగ్ 6 నెలల తరువాత హైదరాబాద్ లో పునః ప్రారంభం అయ్యింది. ఈ మూవీ తరువాత రవితేజ , దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోనేరు సత్యనారాయణ నిర్మాతగా, సక్సెస్ ఫుల్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో నిధి అగర్వాల్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా ఎంపిక అయ్యారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు నిధి అగర్వాల్ ప్లేస్ లో “ఇచ్చట వాహనములు నిలపరాదు “మూవీ ఫేమ్ మీనాక్షి చౌదరి ఎంపిక అయ్యారని , ఆడిషన్స్ లో మీనాక్షి పెర్ఫార్మెన్స్ కు మేకర్స్ ఇంప్రెస్ అయ్యారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =