‘క్రాక్ ట్రైలర్’ – నో డౌట్‌.. ష్యూర్‌ షాట్‌

Mass Maharaja Ravi Teja To Give New Year Treat To His Fans With Krack Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja,Hero Ravi Teja,Actor Ravi Teja,Mass Maharaja Ravi Teja,Krack,Krack Movie,Krack Film,Krack Telugu Movie,Krack Movie Telugu,Krack Trailer,Krack Trailer Out,Krack Trailer Out Now,Krack Trailer Released,Krack Trailer Unveiled,Pothuraju Veera Shankar,Ravi Teja Krack Telugu Movie Trailer,Krack Movie Trailer Out,Ravi Teja Krack Movie Trailer Out,Ravi Teja Krack Movie Trailer

మొత్తానికి మాస్ మహారాజా రవితేజ అభిమానులకు న్యూ ఇయర్ కి మంచి ట్రీటే లభించింది అని చెప్పొచ్చు. రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమా త్వరలో థియేటర్స్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం ఆ అంచనాలను ఇంకారెట్టింపు చేసింది అని చెప్పుడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసారి రవితేజ హిట్ కొట్టడం ఖాయం.. గతంలో పాత రవితేజ కనిపించాడు మళ్లీ ఈ సినిమాతో అన్న అభిప్రాయాలు వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రయిలర్ విషయానికి వస్తే రవితేజ మాస్ ఇమేజ్ కు తగ్గట్టు ఎన్ని మాస్ ఎలిమెంట్స్ కావాలో అన్ని మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ‘‘చూశారా జేబులో ఉండాల్సిన నోటు, చెట్టుకు ఉండాల్సిన కాయ, గోడకు ఉండాల్సిన మేకు.. ఈ మూడు ముగ్గురు తోపుల్ని తొక్కి తాట తీశాయి. ఇక్కడ కామ్ పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే పోలీసోడు’’ అంటూ మొదలైన ట్రయిలర్ లో జోరు చివరిదాకా అలానే కొనసాగింది. యాక్షన్, ఎంటర్‌టైన్మెంట్, రొమాన్స్ అన్నీ ఒకే ట్రైలర్‌లో చూపించేశారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ముఖ్యంగా క్రాక్ ట్రైలర్ ష్యూర్‌ షాట్‌ నో డౌట్‌.. పుచ్చ పగిలిపోద్ది.. `చిన్న బ్రేక్ ఇచ్చానంతే. ఈ లోపు ఎన్ని యాడ్లు వేసేసుకుంటావో వేసేస్కో.. ‘‘ఒంగోలు నడిరోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో సీసం పోస్తా నా కొడకా’’ అంటూ రవితేజ చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మరి ట్రయిలర్ కు అయితే సూపర్ రెస్పాన్స్ వస్తుంది సినిమాకు ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతీ హాస‌న్ హీరోయిన్ గా నటిస్తుంది. స‌ముద్ర‌ఖనీ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 5 =