పెన్ స్టూడియోస్ , ఎ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హైదరాబాద్ లో జరుపుకున్న షూటింగ్ షెడ్యూల్ తో 40 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. మరో షెడ్యూల్ ముంబై లో 15 రోజులపాటు జరగనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఖిలాడి ” మూవీ లో ఇద్దరు కథానాయికలు కాగా ఒక కథానాయికగా దర్శకుడు రాశీఖన్నా ను సంప్రదించినట్టు ,రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. హీరో రవితేజ తో రాశీఖన్నా “బెంగాల్ టైగర్ “, “టచ్ చేసి చూడు ” మూవీస్ తో పాటు “రాజా ది గ్రేట్ ” మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. రాశీఖన్నా ఇప్పుడు హీరో రవితేజ తో నాలుగోసారి జతకట్టి ప్రేక్షకులను అలరించనున్నారు. హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం పలు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: