కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. థియేటర్స్ బంద్ అయ్యి , షూటింగ్స్ నిలిచిపోయి , రిలీజులు ఆగిపోయి చిత్ర పరిశ్రమ పలు నష్టాలకు గురిఅయ్యింది. 6 నెలల విరామం తరువాత షూటింగ్స్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పలు మూవీస్ షూటింగ్స్ పునః ప్రారంభం అయ్యాయి. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలే కాకుండా , బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలు కూడా విడుదలకు సిద్ధం అయ్యాయి. కొన్ని నియమ , నిబంధనలతో థియేటర్స్ రీ ఓపెన్ అయినా ప్రేక్షకాదరణ అంతంత మాత్రంగానే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొంతమంది నిర్మాతలు OTT లపై మొగ్గు చూపినా, కొంతమంది నిర్మాతలు తమ మూవీస్ ను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నాయి. సంక్రాంతి పండగ సినిమా పండగ కాబట్టి పలు మూవీస్ సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఇప్పుడు “క్రాక్ ” మూవీ కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది. సంక్రాంతి పండగకు థియేటర్స్ పూర్వపు వైభవం తో కళ కళ లాడాలని కోరుకుందాం. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , స్టార్ హీరోయిన్ శృతి హాసన్ జంటగా నిజ జీవిత సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ రూపొందుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ , సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండగకు హీరో రవితేజ తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































