సెన్సార్ పూర్తి చేసుకున్న ‘క్రాక్’

Ravi Teja Latest Movie Krack Completes Censor Scrutiny,Ravi Teja,Hero Ravi Teja,Actor Ravi Teja,Mass Maharaja Ravi Teja,Krack,Krack Movie,Krack Telugu Movi9e,Krack Movie Telugu,Krack Film,Krack Movie Latest Updates,Krack Movie News,Ravio Teja Krack Movie Completes Censor Scrutiny,Krack Completes Censor Scrutiny,Krack Movie Completes Censor Scrutiny,Krack Censor Work Completes,Krack Movie Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Tollywood News

మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మూడో చిత్రం ‘క్రాక్‌’. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘క్రాక్’ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ వీడియోగా నిలవడమే గాక రవితేజ ఖాతాలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 7 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోడమే కాదు 2 లక్షల మేర లైక్స్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బృందం. ఇక రిలీజ్ కూడా దగ్గర్లో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్.

కాగా రవితేజ సరసన ఈ సినిమాలో శృతీ హాస‌న్ హీరోయిన్ గా నటిస్తుంది. స‌ముద్ర‌ఖనీ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి చూడబోతే ఈ సినిమాతో రవితేజ గోపీచంద్ హ్యాట్రిక్ కొట్టేలాగే కనిపిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.