‘వర్మ’ సినిమా ఆడిషన్ కోసం సింగిల్ ఫొటోతో..!

Throwback to when Ravi Teja Attended RGV Movie audition with a passport photo

సినీ ఇండస్ట్రీలో వారసత్వంతో ఎంట్రీ అవ్వడం అనేది కొంచం ఈజీనే. అయితే ఆ తర్వాత ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోవడం.. టాలెంట్ ను ప్రూవ్ చేసుకోడం అంటే మాత్రం చాలా కష్టం. ఇక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం అంటే అబ్బో చాలా కష్టమే. ఒకరకంగా అన్నిటిని వొదిలేసి భగీరధ ప్రయత్నం చేస్తే కానీ ఒక సినిమాలో హీరో అయ్యే ఛాన్స్ రాదు. ఇప్పుడంటే ఏదో టెక్నాలజీ పెరిగి సోషల్ మీడియా పుణ్యమా అని అది ఈజీ అయింది కానీ.. ఒకప్పుడు మాత్రం చాలా కష్టమయ్యేది. అలా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. స్టార్ హీరోలు అయిన వాళ్లు చాలా తక్కువమంది. అలా స్వయం కృషితో సినీ పరిశ్రమను ఏలింది మెగా స్టార్ అయితే ఆ తర్వాత మాత్రం రవితేజ పేరే వినిపిస్తుంది. ఇప్పుడున్న హీరోల్లో నాని కూడా అనుకోండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్యారక్టర్ ఆర్టిస్ట్ దగ్గరనుండి చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ ఈ రోజు మాస్ మహా రాజాగా స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ఈ స్థాయికి రావడానికి దానివెనుక ఎంతో కష్టం ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది డైరెక్టర్స్ ను కలిసి ఉంటాడు.. ఎంతో మంది నిర్మాతలను కలిసి ఉంటాడు. ఈ నేపథ్యంలో అప్పట్లో ఒక ఆసక్తికరమైన సంఘటన కూడా చోటుచేసుకుందట. అదేంటంటే.. రాంగోపాల్ వర్మ సినిమా క్షణ క్షణం కు రవితేజ కూడా వెళ్ళాడట. నార్మల్ గా అయితే ఎక్కడైనా ఆడిషన్ కి వెళ్ళినప్పుడు వాళ్ల పోర్ట్ ఫోలియో తీసుకెళ్తుంటారు. కానీ రవితేజ మాత్రం కేవలం ఒక్క ఫొటో అది కూడా న్యూస్ పేపర్ లో చుట్టి తీసుకెళ్ళడట. ఆడిషన్ అయితే అయింది కానీ ఛాన్స్ మాత్రం రాలేదు. ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో దొంగల ముఠా, షాక్ సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు రవితేజకు రామ్ గోపాల్ వర్మకు మంచి రాపో ఉందన్న సంగతి తెలిసిందే.

ఇక కర్తవ్యం సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన రవితేజ.. పలు సినిమాల్లో ప్రాధాన్యత లేని పాత్రల్లో నటించాడు కూడా. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘నీ కోసం’ సినిమాతో సోలో హీరోగా పరిచయమై.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. అయితే దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ సినిమాతో రవితేజ కెరీర్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పొచ్చు. అలా వరుస సినిమాలు చేసుకుంటూ ఇప్పుడు ఈ పొజిషన్ లో వున్నాడు.

ఇక గత కొద్ది కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఈ నేపథ్యంలో ఈసారి మరో డిఫరెంట్ స్టోరీ తో ముందుకు వస్తున్నాడు. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా క్రాక్. డాన్ శీను, బలుపు లాంటి సినిమాల తర్వాత ఈ కాంబినేషన్లో హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. చూద్దాం మరి ఈ సినిమా ఎంత సక్సెస్ అందిస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − three =