మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ సంక్రాంతి పండగ కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందించారు. పలు మూవీస్ కు పోటీగా “క్రాక్ ” మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. “క్రాక్ ” మూవీ విజయం పై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉంది. ఈ మూవీ తరువాత హీరో రవితేజ మరో మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పెన్ స్టూడియోస్ , ఎ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి ” మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రగతినగర్ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో జరుగుతుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకూ 40 శాతం
షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “ఖిలాడి “మూవీ మరో షూటింగ్ షెడ్యూల్ జనవరి నెలలో 15 రోజుల పాటు ముంబై లో జరగనుంది. “ఖిలాడి “మూవీ ని 2021 సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























