
ట్యాగ్ · 40 కథనాలు · పేజీ 2


సెన్సార్ పూర్తి చేసుకున్న 'కొండపొలం'

'కొండపొలం' ట్రైలర్ రిలీజ్

'కొండపొలం' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

'గల్లీ రౌడీ' కొత్త రిలీజ్ డేట్

'బజార్ రౌడి' ట్రైలర్ రిలీజ్

అన్నాచెల్లెళ్లుగా అవికా, నవీన్ చంద్ర
'ఏక్ మినీ కథ' టీజర్ రిలీజ్

'ఆరడుగుల బుల్లెట్' ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ లో మాస్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరో గోపీచంద్ ఇటీవలే సిటీమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ సీటీమార్ సినిమాతో మంచి విజయం దక్కించుకున్నాడు. సీటీమార్ సక్సెస్ సాధించడంతో ఇక ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. గోపీచంద్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్ ". ఇప్పటికే రెండు మూడుసార్లు ఈసినిమా రిలీజ్ వాయిదా పడింది. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ నెల 8న విడుదల కానుండటంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడ్…

సెన్సార్ పూర్తి చేసుకున్న 'కొండపొలం'
‘ఉప్పెన’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతో మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు తను నటిస్తున్న మరో చిత్రం ‘కొండపొలం’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. అడవి నేపథ్యంలో సాగే విభిన్నమైన కథతో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, పాటలు రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గానే ట్రైలర్‌ను రిలీజ్ చేయగా ఈ ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

'కొండపొలం'.. శ్వాసలో లిరికల్ వీడియో రిలీజ్
టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం లో వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం కొండపొలం. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా క్రిష్ ఈసినిమాను తెరకెక్కించాడు. ఇక రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తూనే ఉన్నాం. మిలియన్ల వ్యూస్ తో టాప్ లో ట్రైండ్ అవుతూ ఈ సినిమా ట్రైలర్ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో అటు మెగా అభిమానులు, ఇటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

'కొండపొలం' ట్రైలర్ రిలీజ్
క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా కొండపొలం. మొదటి సినిమాతోనే 2021లోనే మొట్టమొదటి భారీ బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకున్న పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా విడుదలవుతున్న రెండో సినిమా ఇది. దీంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు క్రిష్ డైరెక్షన్.. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి మాములుగానే ఈసినిమాపై అంచనాలు ఉన్నాయి.. దానికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

'కొండపొలం' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ‘ఉప్పెన’ తోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తన తరువాత సినిమాలను కూడా చాలా జాగ్రత్తగా సెలక్ట్ చేసుకుంటున్నాడు. ఈనేపథ్యంలోనే క్రిష్ దర్శకత్వంలో కొండపొలం సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా ఎలా ఉంటుందో అన్న విషయం ఇప్పటికే పోస్టర్లు, టీజర్ చూస్తే అర్థవుతుంది కదా. మరోసారి డిఫరెంట్ కథతో వస్తున్నాడు. ఇక కరోనా సెకండ్ వేవ్ ఉన్నా కానీ క్రిష్ చాలా తక్కువ టైమ్ లోనే ఈ సినిమా షూటింగ్ ముగించేశాడు. అయితే రిలీజ్ మాత్రం లేట్ అయింది. ఈనేపథ్యంలోనే రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదల కాబోతోంది.

'గల్లీ రౌడీ' కొత్త రిలీజ్ డేట్
జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. ముందు కరోనా వల్ల ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేసుకుంటే రీసెంట్ గా బాక్సాఫీస్ వద్ద ఉన్న పోటీకి మరోసారి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అన్నీ బావుంటే నిన్న ఈసినిమా రిలీజ్ అవ్వాల్సింది కానీ అప్పటికే చాలా సినిమాలు ఉండటంతో మేకర్స్ కాస్త వెనక్కి తగ్గారు. ఈవిషయాన్ని అధికారికంగా కూడా చెప్పారు. అయితే రిలీజ్ వాయిదా వేస్తూనే సెప్టెంబర్ లోనే రిలీజ్ డేట్ ఉంటుందని ముందే తెలిపారు. ఈనేపథ్యంలోనే నేడు ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సెప్టెంబర్ 17న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టుగా…

'కొండపొలం' రకుల్ ఫస్ట్ లుక్ రిలీజ్
క్రిష్-వైష్ణవ్ తేజ్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కొండపొలం. చాలా రోజుల తరువాత ఇటీవలే ఈసినిమాటైటిల్ ను అలాగే వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఇక ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా నుండి రకుల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇందులో రకుల్ ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది.

వైష్ణవ్ తేజ్-క్రిష్ సినిమా.. టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
మొత్తానికి వైష్ణవ్ తేజ్ రెండో సినిమా నుండి అప్ డేట్ వచ్చేసింది. మొదటి సినిమా ఉప్పెన తోనే టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ అయిన వైష్ణవ్ తేజ్ వెంటనే రెండో సినిమాను కూడా పూర్తి చేసేశాడు. క్రిష్ లాంటి పెద్ద డైరెక్టర్ తోనే అవకాశం దక్కించుకున్నాడు. ఈసారి కూడా వైష్ణవ్ తేజ్ డిఫరెంట్ స్టోరీతోనే వస్తున్నాడు. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలానే టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా ఈసినిమాను క్రిష్ తెరకెక్కించిన నేపథ్యంలో అదే టైటిల్ ను ఫిక్స్ చేశారంటూ గత కొద్దికాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటినే…

వైష్ణవ్ తేజ్-రకుల్ సినిమా.. టైటిల్, ఫస్ట్ లుక్ కు డేట్ ఫిక్స్
ఉప్పెన సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ రెండో సినిమాకు పెద్ద టైమ్ తీసుకోలేదు. వెంటనే క్రిష్ తో రెండో సినిమాను చేసేశాడు. ఇక ఈసినిమా పూర్తి అవ్వడానికి కూడా ఎన్నో రోజులు పట్టలేదు. కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడు ఒకసారి గ్యాప్ వచ్చినా ఆ తరువాత క్రిష్ చాాలా తొందరగానే సినిమాను కంప్లీట్ చేసేశాడు. అయితే షూటింగ్ అయితే ఎప్పుడో పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది కానీ ఇన్నిరోజులు ఈసినిమా నుండి మాత్రం ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు చిత్రయూనిట్. ఇప్పుడు ఫైనల్ గా అందరూ సినిమాలు రిలీజ్ లు చేసుకుంటున్న నేపథ్యంలో క్రిష్ కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశాడు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి నేడు చిన్న…

'బజార్ రౌడి' ట్రైలర్ రిలీజ్
స్టార్ హీరోల సినిమాలంటే చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అయితే కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలను కూడా- ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాంటి కోవకు చెందినవే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినిమాలు. కమర్షియల్ సినిమాల్లో ఉన్నట్టే.. తన సినిమాల్లో కూడా యాక్షన్ సీన్స్, పాటలు అన్ని ఉంటాయి. అయితే అవి కామెడీగా ఉన్నా అవే ప్రేక్షకులకు నచ్చుతాయి. అందుకే సంపూ సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారు. మొదటి సినిమా 'హృదయ కాలేయం' తరువాత ‘సింగం 123’, కొబ్బరిమట్ట సినిమాలు విడుదల చేసిన సంపూ.. ఆతరువాత పలు సినిమాల్లో కమెడియన్, అతిథి పాత్రల్లో కూడా కనిపించాడు.

అన్నాచెల్లెళ్లుగా అవికా, నవీన్ చంద్ర
ఇండస్ట్రీలో అన్నాచెల్లిళ్లు నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఒకటి రెండు సినిమాలు వచ్చినా ఇప్పుడు అవి కూడా చాలా వరకూ తగ్గిపోయాయి. అయితే ఇన్నాళ్లకు మళ్లీ ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమా రావడం ఆసక్తికరం. నవీన్ చంద్ర, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో వీరిద్దరూ అన్నాచెల్లెళ్ళు గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా ఫస్ట్ లుక్ ను కూాడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

"తిమ్మరుసు"ప్రమోషనల్ సాంగ్ రిలీజ్
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ , సూపర్ హిట్ "టాక్సీవాలా "మూవీ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ జంటగాఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ , ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో అసైన్‌మెంట్ వాలి ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన లీగల్ క్రైమ్ థ్రిల్లర్ “తిమ్మరుసు “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. అజయ్ , బ్రహ్మాజీ , ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

'పచ్చీస్'- జూదం లిరికల్ సాంగ్ రిలీజ్
శ్రీకృష్ణ, రామసాయి దర్శకత్వంలో రామ్స్, శ్వేతావర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘పచ్చీస్'. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ఎంతో మంది సెలబ్రిటీస్ కు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు రామ్స్. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ అయిన రామ్స్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ రిలీజ్ కాగా ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

'101 జిల్లాల అందగాడు' టైటిల్ సాంగ్ రిలీజ్
రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్, రుహనీ శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా '101 జిల్లాల అందగాడు'. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుండగానే అప్పుడే ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఈసినిమాలో గొత్తి సూర్య నారాయణ అనే పాత్రలో నటిస్తున్న అవసరాల బట్టతలతో పడే పాట్లను చూపించనున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని కలిగించారు.

'101 జిల్లాల అందగాడు' సాంగ్ ప్రోమో రిలీజ్
విద్యాసాగర్ దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్ హీరోగా 101 జిల్లాల అందగాడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా ఫస్ట్ లుక్ ను చాలా డ్రామా క్రియేట్ చేసే రిలీజ్ చేశాడు అవసరాల శ్రీనివాస్. ఇక ఫస్ట్ లుక్ కు చాలామంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈ చిత్రంలోనే అవసరాల శ్రీనివాస్ బట్టతలతో గొత్తి సూర్యనారాయణ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి '101 జిల్లాల అందగాడు' సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.
'ఏక్ మినీ కథ' టీజర్ రిలీజ్
అతి తక్కువ కాలంలోనే యూవీ క్రియేషన్స్ ఇండస్ట్రీలో టాప్ నిర్మాణ సంస్థగా ఎదిగింది. అంతేకాదు ఒకపక్క పెద్ద సినిమాలు చేస్తూనే మరోపక్క కొత్త దర్శకులను పరిచయం చేస్తూ.. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ చిన్న సినిమాలను కూడా నిర్మిండానికి కూడా రెడీ అవుతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌కి అనుభంద సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌ని స్థాపించి అందులో కూడా సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేశారు. దీనిలో భాగంగానే యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ తో మరో నిర్మాణ సంస్థ మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ఇప్పుడు ఏక్ మినీ కథ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఒరేయ్ బుజ్జిగా 'కురిసెన.. కురిసెన' పాట రిలీజ్
విజయ్‌కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానున్న నేపథ్యంలో... ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు. ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున, మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఈ పాటకు కె.కె. సాహిత్యం…
'సింగిల్స్' కోసం 'యాంటీ వాలెంటైన్స్ డే' సాంగ్
ఏ రోజు ఏ ఫెస్టివల్ వస్తుందో.. ఏ రోజు ఏ స్పెషల్ డే ఉంటుందో ఎంత మందికి తెలుసో?లేదో? తెలియదు కానీ ఫిబ్రవరి 14 అంటే మాత్రం అందరికీ వెంటనే 'వాలెంటైన్స్ డే' అని గుర్తొచ్చేస్తుంది. ఇక ఈ రోజు ప్రేమికులకు ఎంత స్పెషల్ డే నో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రోజు ఎప్పుడు వస్తుందా... ఎప్పుడు తమ ప్రేమను వ్యక్తం చేద్దామా అని ఎదురుచూస్తుంటారు. మరి ప్రేమికుల సంగతి పక్కన పెడితే సింగిల్స్ పరిస్థితి ఏంటి. పాపం ప్రేమికులను చూసి కాస్త జెలస్ ఫీల్ అవ్వడమే తప్ప చేసేదేమి లేదు. సోషల్ మీడియాలో ఏంటి జోక్స్, మీమ్స్ స్టేటస్ లు పెట్టుకొని హ్యాపీ ఫీల్ అవ్వడమే. అయితే ఇప్పుడు అలాంటి వారి కోసం యాంటీ వాలెంటైన్స్ డే సాంగ్ ఒకటి…

సంక్రాంతి పండుగకు ‘మ్యాంగో మ్యూజిక్’ నుండి స్పెషల్ సాంగ్ రిలీజ్
తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారు. ఇక ఈ పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. పండుగకు పది రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. మిగతా రోజులు ఎక్కడున్నా సరే ఈ పండుగ సమయానికి ఇళ్ళల్లో వాలిపోతారు. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు ,గొబ్బమలతో స్వాగతం పలుకుతాయి. గంగిరెద్దులు, కోడి పందాలు, ఎడ్ల పందాల మాట సరేసరి. ఒక్కమాటలో చెప్పాలంటే మన తెలుగు సంప్రదాయం మొత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది.
సంక్రాంతి పండుగకు 'మ్యాంగో మ్యూజిక్' నుండి స్పెషల్ సాంగ్
తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారు. ఇక ఈ పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. పండుగకు పది రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. మిగతా రోజులు ఎక్కడున్నా సరే ఈ పండుగ సమయానికి ఇళ్ళల్లో వాలిపోతారు. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు ,గొబ్బమలతో స్వాగతం పలుకుతాయి. గంగిరెద్దులు, కోడి పందాలు, ఎడ్ల పందాల మాట సరేసరి. ఒక్కమాటలో చెప్పాలంటే మన తెలుగు సంప్రదాయం మొత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది.