
ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 102


జనక అయితే గనక.. స్పెషల్ ప్రీమియర్ షోలు

గోపీచంద్ విశ్వం టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

35 కోసం రానున్న నాని

మరోసారి అజిత్ తో త్రిష

దేవర థర్డ్ సింగిల్ రానుంది

నేను రాసినదాని కంటే సూర్య అద్భుతంగా చేశారు

కళ్యాణ్ బాబూ.. ఈ పుట్టినరోజు నీకు మరీ ప్రత్యేకం

దేవర నుండి ఈసారి వీడియో సాంగ్
ఎన్టీఆర్ దేవర నుండి ఇప్పటివరకు వచ్చిన రెండు పాటలు ఒకదాన్ని మించి మరొకటి చార్ట్ బాస్టర్ అయ్యాయి.దాంతో మూడో పాట పై అంచనాలు భారీగా వున్నాయి.ఇక ఈ మూడో సాంగ్ దావూది రేపు రిలీజ్ కానుంది.అయితే లిరికల్ వీడియో కాకుండా ఏకంగా వీడియో సాంగ్ నే రిలీజ్ చేస్తున్నారు.అనిరుధ్ ట్యూన్స్ కు ఎన్టీఆర్ ,జాన్వీ కపూర్ వేసే స్టెప్స్ అదిరిపోనున్నాయట.ఈసందర్భంగా అందులోని డ్యాన్స్ స్టిల్ ను రిలీజ్ చేశారు.మరి ఈసాంగ్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

బిగ్ బాస్ వలన 35 సినిమాకు మరింత రీచ్ వచ్చింది
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్."35-చిన్న కథ కాదు'. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్.

రణ్‍వీర్‌తో దీపికా మెటెర్నిటీ ఫొటోషూట్.. నెట్టింట వైరల్
బాలీవుడ్ స్టార్ పెయిర్ రణ్‍వీర్ సింగ్, దీపికా పదుకొణే త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న దీపికా ఈ నెలలోనే ప్రసవించనున్నారని సమాచారం. ఈ తరుణంలో దీపికా భర్త రణ్‍వీర్‌తో కలిసి మెటర్నిటీ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె తన బేబీ బంప్‍ను చూపిస్తూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. గర్భంతో దిగిన ఈ ఫోటోలను బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో తన ఇన్‍స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది దీపిక.

ఏపీలో భారీ వరదలు.. ఆయ్ యూనిట్ కీలక నిర్ణయం
నార్నే నితిన్ హీరోగా వచ్చిన ఆయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ఆగస్టు 15న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది

ఎన్టీఆర్ గొప్ప మనస్సు.. తెలుగు రాష్ట్రాలకు భారీ సాయం
టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కష్టాల్లో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించడంలో ముందుంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక సందర్భాల్లో అవసరంలో ఉన్నవారికి అండగా ఉన్న ఆయన తాజాగా మరోసారి తన గొప్ప మనస్సు చాటుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా వరదలు ముంచెత్తి చాలా ప్రాంతాలు జల దిగ్బంధం అయ్యాయి.
కన్నప్ప.. గూస్‌బంప్స్ తెప్పించేలా అర్పిత్ రంకా ఫస్ట్ లుక్ పోస్టర్
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వదులుతున్నారు. సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. అవన్నీ మంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా మరో పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను టీం విడుదల చేసింది.

జనక అయితే గనక.. స్పెషల్ ప్రీమియర్ షోలు
టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఈ సినిమాతో మరో హిట్ అందుకోబోతున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాను శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు.

గోపీచంద్ విశ్వం టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న తాజా చిత్రం 'విశ్వం'. ఈ క్రేజీ కాంబో నుంచి ఈద్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ స్ట్రైక్ వీడియో ఆడియెన్స్ కి మాస్ ఫీస్ట్‌ని అందించింది. గోపీచంద్ 32వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మిస్తుండగా.. రీసెంట్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ భాగస్వామిగా చేరిన విషయం తెలిసిందే.

35 కోసం రానున్న నాని
ఈవారం థియేటర్లకు వచ్చే సినిమాల్లో 35 చిన్న కథ కాదు కూడా ఒకటి.నిజానికి గత నెలలోనే రిలీజ్ కావాల్సివుంది కానీ పోటీ ఎందుకని రిలీజ్ డేట్ చేంజ్ చేశారు.ఇక ఈసినిమాకు ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా సమ్పరకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల నుంచి నేను నేర్చుకున్నది ఇదే
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ శుభ సందర్భంగా ఆయన స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని హైటెక్స్ నోవోటెల్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా సుచిర్ ఇండియా కిరణ్‌తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.

మరోసారి అజిత్ తో త్రిష
తమిళ హీరో తల అజిత్ తో వెంటనే మరో సినిమా చేయడానికి ఓకే చెప్పింది హీరోయిన్ త్రిష.అందులో భాగంగా అజిత్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో విడా ముయార్చి ఒకటి.మగిజ్ తిరుమనేని ఈసినిమాను తెరకెక్కిస్తుండగా అర్జున్ సర్జా ఆండ్రియా జెర్మియా,అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇందులో అజిత్ కు జోడిగా త్రిష కనిపించనుంది.షూటింగ్ కూడా అయిపొయింది.అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.ఈసినిమాను ఈఏడాది చివర్లో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ బర్త్ డే.. అల్లు అర్జున్ స్పెషల్ విషెస్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఆయనకు తన సోదరుడు, టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆయనకు ప్రత్యేకంగా విషెస్ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్‌డే పవర్ స్టార్, డిప్యూటీ సీఎం (డీసీఎం) పవన్ కళ్యాణ్ గారు’ అంటూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

దేవర థర్డ్ సింగిల్ రానుంది
మచ్ అవైటెడ్ ఎన్టీఆర్ దేవర ఆల్బమ్ ఫై ముందు నుండే ఓ రేంజ్ లో అంచనాలు వున్నాయి.అనిరుధ్ ఈసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో సాంగ్స్ ఫై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఫ్యాన్స్.అయితే అనిరుధ్ వారి అంచనాలకు తగ్గట్లే సాంగ్స్ ఇస్తూ వస్తున్నాడు.ఫస్ట్ సాంగ్ ఫియర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా సెకండ్ సాంగ్ చుట్టమల్లేకు అంతకుమించి ఇచ్చాడు.అతి తక్కువ అసమయం లోనే ఈసాంగ్ 100మిలియన్ వ్యూస్ ను రాబట్టుకుంది.

సరిపోదా శనివారం... సెన్సేషనల్ రన్
నాని సరిపోదా శనివారం సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తోంది.గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడితెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.అయితే ఈ ప్రభావాన్ని తట్టుకొని సరిపోదా సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంటుంది.కొన్ని ఏరియాల్లో వర్షం ఎఫెక్ట్ వున్నా నిన్న ఈసినిమా సూపర్ గా హోల్డ్ చేస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో 4వరోజు దాదాపు 4కోట్ల షేర్ ను రాబట్టింది.ఇక నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 68.52కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో బ్రేక్ ఈవెన్ లో 80శాతం రికవరీ చేసింది.ఈవారంలో 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.నానికి ఇది రెండో 100కోట్ల సినిమా కానుంది.ఇంతకుముందు దసరాతో తొలిసారి ఆ క్లబ్ లో జాయిన్…

బాలయ్యతో కలిసి ఒక ఫాక్షన్ సినిమా చేయాలని నా కోరిక
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ శుభ సందర్భంగా ఆయన స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని హైటెక్స్ నోవోటెల్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా సుచిర్ ఇండియా కిరణ్‌తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్
మోస్ట్ ఇంట్రెస్టింగ్ రియాల్టీ షో బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ ప్రారంభమైంది. కింగ్ నాగార్జున ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఈ షో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్‌టైనింగ్‍గా సాగిన ఈ వేడుకలో కంటెస్టెంట్లను హోస్ట్ నాగ్ పరిచయం చేశారు. మొత్తం 14 మంది, ఏడు జోడీలుగా.. యష్మి గౌడ - నిఖిల్, అభయ్ నవీన్ - ప్రేరణ, ఆదిత్య ఓం - సోనియా, బెజవాడ బేబక్క - ఆర్జే శేఖర్ బాషా, కిర్రాక్ సీత - నాగ మణికంఠ, పృథ్విరాజ్ - విష్ణుప్రియ భీమినేని, నైనిక - నబీల్ ఆఫ్రిది హౌస్ లోకి అడుగుపెట్టారు.

నేను రాసినదాని కంటే సూర్య అద్భుతంగా చేశారు
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా, ఎస్‌జే సూర్య పవర్‌ఫుల్ రోల్‌లో నటించగా.. సాయికుమార్, శివాజీరాజా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.

సినిమా బావుంటే తెలుగు ఆడియన్స్ తలమీద పెట్టుకుంటారు
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా, ఎస్‌జే సూర్య పవర్‌ఫుల్ రోల్‌లో నటించగా.. సాయికుమార్, శివాజీరాజా కీలక పాత్రలు పోషించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించింది.

రిషబ్ శెట్టి ప్లాన్ చేస్తే అందులో నటించడానికి నేను రెడీ - ఎన్టీఆర్
'కాంతారా' ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమని ప్రకటించారు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. ఈ మేరకు ఆయన తాజాగా తన తల్లి షాలినితో కలిసి కర్ణాటక లోని ప్రముఖ మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తారక్ నటించిన దేవర సినిమా ఈనెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తవగా.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తదుపరి మూవీ చేసేందుకు సిద్దమవుతున్నారు.

కళ్యాణ్ బాబూ.. ఈ పుట్టినరోజు నీకు మరీ ప్రత్యేకం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తన సోదరుడు, టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు. అందులో తమ్ముడిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న మెగాస్టార్.. కళ్యాణ్ బాబూ, ఈ పుట్టినరోజు నీకు మరీ ప్రత్యేకం అని పేర్కొన్నారు. దీంతో ఈ అన్నదమ్ముల అనుబంధాన్ని మెచ్చుకుంటూ మెగా ఫ్యాన్స్ నెట్టింట ప్రసంశలు కురిపిస్తున్నారు.