బాలీవుడ్ స్టార్ పెయిర్ రణ్‍వీర్ సింగ్, దీపికా పదుకొణే త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న దీపికా ఈ నెలలోనే ప్రసవించనున్నారని సమాచారం. ఈ తరుణంలో దీపికా భర్త రణ్‍వీర్‌తో కలిసి మెటర్నిటీ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె తన బేబీ బంప్‍ను చూపిస్తూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. గర్భంతో దిగిన ఈ ఫోటోలను బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో తన ఇన్‍స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది దీపిక.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొత్తంగా 14 ఫొటోలను ఈ బాలీవుడ్ దంపతులు పోస్ట్ చేయగా.. అందులో దీపికాను వెనుక నుంచి రణ్‍వీర్ ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటున్న ఫొటో చూడముచ్చటగా వుంది. ఇక ఈ ఫోటోలకు దీపికా పదుకొణే కొన్ని ఎమోజీలను జోడించింది. దిష్టితగలకుండా కంటి ఎమోజీతో పాటు ఇన్‌ఫినీటీ ఎమోజీని వాటికి జతచేసింది. కాగా ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. భర్త రణ్‍వీర్ సహా ఆమె ఫ్యాన్స్ ఆ పోస్టుకు లైక్స్ కొడుతున్నారు.
అలాగే వారి స్నేహితులులతో పాటు కో-స్టార్స్ ఈ ఇన్‌స్టా పోస్టుపై పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. గతంలో దీపికాతో కలిసి ఓ సినిమాలో నటించిన హాలీవుడ్ హీరో విన్ డీజిల్ కూడా దీపికా పోస్టుకు లైక్ కొట్టడం విశేషం. ఇంకా బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్ తదితరులు హార్ట్ ఎమోజీలను పెట్టి లైక్స్ కొట్టారు. బెస్ట్ కపుల్‍గా ఉన్న వీరు బెస్ట్ పేరెంట్స్ గానూ నిలుస్తారంటూ నెటిజన్స్ కొనియాడుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: