పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌ డే.. అల్లు అర్జున్‌ స్పెషల్ విషెస్‌

Icon Star Allu Arjun Extends Birthday Wishes To Power Star Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఆయనకు తన సోదరుడు, టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బర్త్‌ డే విషెస్‌ తెలుపుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా పవన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఆయనకు ప్రత్యేకంగా విషెస్‌ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్‌డే పవర్‌ స్టార్‌, డిప్యూటీ సీఎం (డీసీఎం) పవన్‌ కళ్యాణ్‌ గారు’ అంటూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా గత కొన్ని రోజులుగా మెగా ఫ్యాన్స్‌ అల్లు అర్జున్‌పై కోపంగా వున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన కొన్ని పరిణామాల వలన వారు ఆయనపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవర్ స్టార్‌కు బన్నీ బర్త్‌ డే విషెస్‌ తెలియజేయడం ఆసక్తిగా మారింది. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.