‘కాంతారా’ ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమని ప్రకటించారు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. ఈ మేరకు ఆయన తాజాగా తన తల్లి షాలినితో కలిసి కర్ణాటక లోని ప్రముఖ మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తారక్ నటించిన దేవర సినిమా ఈనెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తవగా.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తదుపరి మూవీ చేసేందుకు సిద్దమవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇటీవల చేతికి స్వల్ప గాయం అవడంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2 తల్లి షాలిని పుట్టిన రోజు సందర్భంగా ఆమె సొంతూరు కుందాపురాకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో శనివారం ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్న వారు.. ఆదివారం కొల్లూరులోని మూకాంబిక ఆలయానికి వెళ్లారు. ఇక సంప్రదాయ పంచె కట్టులో కనిపించిన ఎన్టీఆర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక వారి వెంట కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కూడా ఉన్నారు.
కాగా రిషబ్ శెట్టితో ఎన్టీఆర్‌కు మంచి అనుబంధం ఉంది. అందుకే ఎన్టీఆర్, షాలిని బెంగళూరు వెళ్లిన క్రమంలో రిషబ్ శెట్టి వారిని విమానాశ్రయానికి వెళ్లి రిసీవ్ చేసుకున్నారు. అలాగే దగ్గరుండి ఆలయాల సందర్శన చేయించారు. దీంతో, కాంతార చాప్టర్-1 సినిమాలో తారక్ నటించనున్నారని రూమర్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో ఓ పాత్రికేయుడు దీనిపై ఎన్టీఆర్‌ను ప్రశ్నించగా.. అందుకు ఆయన స్పందించారు.
“ఒకవేళ కాంతారలో నన్ను భాగం చేయాలని రిషబ్ శెట్టి ప్లాన్ చేస్తే.. అందుకు నేను రెడీ” అని ఎన్టీఆర్ తెలిపారు. ఇక ఇప్పటికే ‘కాంతార’ ప్రీక్వెల్‍పై మార్కెట్ లో ఫుల్ బజ్ ఉంది. ఒకవేళ ఇందులో ఎన్టీఆర్ కూడా నటిస్తే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్‍కు వెళుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో 2022లో వచ్చిన కాంతార పాన్ ఇండియా రేంజ్‍లో బ్లాక్‍బస్టర్ అయింది. ఈ సినిమాకు ప్రీక్వెల్‍గానే ప్రస్తుతం ‘కాంతార చాప్టర్-1’ చేస్తున్నారు రిషబ్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: