నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా, ఎస్‌జే సూర్య పవర్‌ఫుల్ రోల్‌లో నటించగా.. సాయికుమార్, శివాజీరాజా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. “నామీద నాకున్న నమ్మకం కంటే నామీద నాని గారికి వున్న నమ్మకం ఎక్కువ. సగం గడ్డంతో ఇంట్రో సీన్ చేద్దామని చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా చేసేద్దామని అన్నారు. అంత ఫ్రీడమ్ దొరికింది కాబట్టే ఇలాంటి మంచి సినిమా రాగలిగింది. ఇప్పటివరకూ కొంచెం సాఫ్ట్ రోమ్ కాం సినిమాలే చేశాను. ఇలాంటి స్కేల్ వున్న సినిమాని హ్యాండిల్ చేయగలని నమ్మి బడ్జెట్ పెట్టిన నిర్మాత దానయ్య గారికి థాంక్ యూ” అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ప్రియాంక ఈ కథకు బెస్ట్ ఆప్షన్. చారులత క్యారెక్టర్ చాలా ఎంజాయ్ చేస్తూ రాశాను. సాయి కుమార్ గారితో ప్రతి సీన్ లో ఎదో ఒక పని చేయిస్తూనే వున్నాను (నవ్వుతూ). శివాజీ రాజా గారు నా లక్కీ ఛార్మ్. ఎస్జే సూర్య గారి పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చాలా అనందాన్ని ఇచ్చింది. నేను రాసినదాని కంటే అద్భుతంగా చేశారు. మురళి శర్మగారితో పాటు అందరికీ పేరుపేరునా థాంక్స్. ఇది టీం ఎఫర్ట్. ఇంత అద్భుతమైన సక్సెస్ ని ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ” అని చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: